Jailer 2:సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రజనీకాంత్ (Rajinikanth ) ఏడుపదుల వయసు దాటినా.. వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా జైలర్ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి భాగం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతోనే అందరి చూపు ఈ చిత్రంపై పడిందని చెప్పవచ్చు. అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఇకపోతే మొదటి పార్ట్ లో యోగిబాబు కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగా.. ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కం హీరో పార్ట్ 2లో ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ సంతానం జైలర్ 2 చిత్రంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. తాజా షెడ్యూల్లో ఆయన సెట్ పై పాల్గొన్నారట. ముఖ్యంగా సంతానం, యోగి బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలవనున్నాయని.. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ కైనా కచ్చితంగా థియేటర్ కి వెళ్ళాలి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నెల్సన్ స్టైల్ , ఫన్, రజినీకాంత్ ఎనర్జీ ఇద్దరు కమెడియన్ల టైమింగ్ అన్ని కలిస్తే ఖచ్చితంగా జైలర్ 2 బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ పేరు సొంతం చేసుకున్న సంతానం (Santhanam ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో.. కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతానం.. ఆ తర్వాత డిడి రిటర్న్స్, వడక్కుపట్టి రామస్వామి, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ వంటి చిత్రాలలో లీడ్ రోల్ పోషించి సక్సెస్ అయి.. ఇప్పుడు మళ్ళీ రజినీకాంత్ సినిమాలో కమెడియన్ గా నటించబోతున్నారు. మరి ఈ సినిమా సంతానం కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ALSO READ:Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్.. రివ్యూ పంచుకున్న స్టార్ కిడ్!
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి గతంలో కూడా రజనీకాంత్ తాను అలసిపోయానని, ఇక సినిమాలు చేయలేనని ప్రకటించారు. కానీ ఒక సినిమా తర్వాత మరొక సినిమా రావడంతో ఆయన సినిమాలు చేయక తప్పలేదు. ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్న ఈయన మరొకవైపు కమలహాసన్ తో మల్టీ స్టారర్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రజినీకాంత్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.