KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 కోసం 2025 డిసెంబర్ 15న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఈ వేళానికి ముందు జట్లు ఆటగాళ్ళని విడుదల చేయడం, కెప్టెన్లను మార్చడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే 2025 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి.. ఐపీఎల్ 2025 టైటిల్ ని కైవసం చేసుకుంది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించి కప్పు గెలిచింది. అయితే 2026 సీజన్ లో కూడా వరుసగా రెండవ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది ఆర్సిబి. ఈ క్రమంలో జట్టులోని కొన్ని బలహీనతలపై దృష్టి సారించింది.
2026 మినీ వేళానికి ముందు ఆర్సిబి ముఖ్యంగా జట్టులోని బ్యాటింగ్ విభాగంపై పూర్తి దృష్టి పెట్టింది. జట్టులోని బ్యాటింగ్ ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని భావిస్తుంది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కి ఆర్సిబి భారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా కేఎల్ రాహుల్ కి 25 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. గత సంవత్సరం కె.ఎల్ రాహుల్ లక్నో నుండి ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరాడు.
Also Read: Glenn Phillips: ప్రియురాలితో ఫీట్లు.. ఈ క్రికెటర్ మామూలోడు కాదురో
అయితే ఇప్పుడు అతడు మరోసారి జట్టు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్సీ, ఓపెనింగ్ డ్యూటీ, వికెట్ కీపింగ్ పూర్తి ప్యాకేజీని అందించగలడు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ దాదాపు 54 సగటుతో 539 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టును వదిలేస్తాడా..? లేదా..? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఆర్సిబి జట్టు అతడిని జట్టులోకి తీసుకోవచ్చని నివేదికలు ఉన్నాయి.
కే.ఎల్ రాహుల్ ఆర్సిబి లోకి వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఆటగాడు కావడంతో ఆర్సిబి తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్లు సమాచారం. 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు ఓ ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ కి ఇదే విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్..కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
ఆ సందర్భంలో కేఎల్ చేసిన వ్యాఖ్యలు కూడా అతడు నిజంగానే అర్సిబి లోకి వెళ్ళబోతున్నాడనే ప్రచారానికి బలం చేకూర్చింది. మీరు మళ్లీ ఆర్సిబి జట్టు తరుపున ఆడితే చూడాలని ఉంది..? అంటూ అభిమాని సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ని అడిగాడు. దీనికి కేఎల్ రాహుల్ బదిలీస్తూ “లెట్స్ హోప్” అని కామెంట్ చేశాడు. కానీ 2025 సీజన్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఐతే ఈసారి ఆర్సిబి జట్టు కేఎల్ రాహుల్ కి 25 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
🚨 IPL Trade Update 🚨
RCB have offered 25 crore to KL Rahul to stay away from RCB.
Source (AZnews) pic.twitter.com/esjhjRYHzW
— ADITYA (@Wxtreme10) October 29, 2025