
Samantha Photos (Source: Instagram)
Samantha in Blue Silk Saree Look: సమంత ప్రస్తుతం నటన పక్కన పెట్టింది. దశాబ్దంపైగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగువెలిగిన సామ్ ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించింది. ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతుండటం, మయోసైటిల్ వల్ల తరచూ అనారోగ్యం బారిన పడుతుండటం నటనను పక్కన పెట్టిన నిర్మాతగా కొత్త కెరీర్‌ని ప్రారంభించింది.

Samantha Photos (Source: Instagram)
ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్‌ని స్థాపించి సినిమాలు నిర్మిస్తుంది. శుభం సినిమాతో నిర్మాతగా లాంచ్ అయిన సామ్.. ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టింది. 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎప్పుడో దీనిపై ప్రకటన చేసి.. నిన్న పూజ కార్యక్రమంతో సినిమాను లాంచ్ చేసింది.

Samantha Photos (Source: Instagram)
నటిగా ఎన్నో విజయాలు అవార్డులు, పురస్కారాలు అందుకున్న సామ.. నిర్మాతగా తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమైంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మెల్లిమెల్లిగా టాలీవుడ్ దూరమైన సామ్ వెబ్ సిరీస్‌లు చేస్తూ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

Samantha Photos (Source: Instagram)
దీంతో ఇక తెలుగులో ఆమె కనిపించదని అనుకున్న ఫ్యాన్స్ కి నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతం ఆమె ముంబైలోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె తన పర్సనల్ లైఫ్ కి విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్లో ఉందంటూ ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతుంది.

Samantha Photos (Source: Instagram)
వాటికి మరింత బలం చేకురుస్తూ సమంత తరచూ రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. అంతేకాదు ఇటీవల దీపావళిని కూడా అతడితోనే సెలబ్రేట్ చేసింది.

Samantha Photos (Source: Instagram)
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సమంత నీలి రంగు సిల్క్ చీరలో సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.