Srinidhi Shetty Photos: హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమాతోనే ప్యాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, పలు బ్యూటీ పోటీల్లో పాల్గొన్ని గెలిచిన శ్రీనిధి.. ‘కేజీఎఫ్’ మూవీతో హీరోయిన్‌గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’లో యశ్ సరసన నటించి ప్యాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకుంది.
‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్ తర్వాత ‘కోబ్రా’ మూవీతో తమిళంలోకి ఎంటర్ అయ్యింది శ్రీనిధి.
ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది.
శ్రీనిధి శెట్టి డెబ్యూ చేస్తున్న ‘తెలుసు కదా’ మూవీ విడుదల అవ్వకముందే అప్పుడే తెలుగులో రెండో అవకాశం కూడా దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల ‘సరిపోదా శనివారం’తో హిట్ కొట్టిన నాని సరసన నటించడానికి శ్రీనిధి సిద్ధమవుతోందని సమాచారం.
ఎప్పుడూ కనీసం మూడు సినిమాలను అయినా ఓకే చేసి.. ఒకటి ఫినిష్ అవ్వగానే బ్రేక్ లేకుండా మరొక సినిమాకు షిఫ్ట్ అయ్యే నాని.. ఇప్పుడు ‘హిట్ 3’పై ఫోకస్ చేస్తున్నాడు.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’లో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రూమర్స్ విన్న ప్రేక్షకులు నాని, శ్రీనిధి పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని ఫీలవుతున్నారు.