Mithra Mandali: కమెడియన్ ప్రియదర్శి కోర్ట్ సినిమాతో స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తరువాత హీరోగా మంచి మంచి ఛాన్స్ లు అందుకుంటున్నాడు. అయితే.. ఛాన్స్ లు వచ్చినంత ఈజీగా విజయాలు దక్కవు అనేది గుర్తించాల్సిన విషయం. సక్సెస్ వచ్చాక.. ప్రేక్షకులు ఒకసారి నమ్మడం మొదలుపెట్టాకా ఎంతో ఆచితూచి అడుగులు వేయాలి. వారికి తమ నుంచి ఎలాంటి సినిమాలు కావాలని కోరుకుంటున్నారో అలాంటివి ఇవ్వాలి. ఇలా ఆలోచినకుండా వచ్చిన అవకాశం అలా పట్టుకొని సినిమాలు చేస్తే రిజల్ట్ ఇలాగే వస్తుంది. ప్రియదర్శి హీరోగా నటించిన మిత్రమండలి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రియదర్శి,నిహారిక NM,రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన చిత్రం మిత్రమండలి. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పించడంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇక నలుగురు మంచి కమెడియన్స్ ఉండడంతో సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలను పెట్టుకున్నారు. అంతేనా ఈ సినిమా ప్రమోషన్స్ లో బన్నీ వాస్.. వెంట్రుక కాంట్రవర్సీతో మరింత హైప్ తెచ్చుకున్నది.
ఇక ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 16 న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అర్ధం పర్థం లేని కథతో ప్రేక్షకుల మైండ్ తిన్నారని నెటిజన్స్ పెదవి విరిచారు. ప్రియదర్శి ఇలాంటి కథలను ఎంచుకోని తప్పు చేస్తున్నట్లు మాట్లాడారు. ఇక నిహారిక nm టాలీవుడ్ ఎంట్రీ ప్లాప్ తో మొదలయ్యింది. ఇక ఇప్పుడు నెల తిరక్కుండానే మిత్రమండలి ఓటీటీ బాట పట్టింది.
మిత్రమండలి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. నవంబర్ 6 నుంచి అమెజాన్ లో మిత్రమండలి స్ట్రీమింగ్ కు సిద్ధమైందని తెలిపారు. అంతే కాదు కొత్త వెర్షన్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. మరి థియేటర్ లో ప్లాప్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
We laughed, we learnt, we recut 😅#MithraMandali gets a brand new version. This time, sharper and lot funnier…
Here’s our heart once again on @PrimeVideoIN from November 6 @JustNiharikaNm @smayurk @IamVishnuOi #PrasadBehara @vennelakishore #Satya @TheBunnyVas… pic.twitter.com/1gFMCL1UcO
— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 5, 2025