Dheeraj Mogilineni: ఈ మధ్య ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. సినిమా హిట్ అయితే నిర్మాతలు.. హీరోలకు, డైరెక్టర్స్ కు కార్లు, వాచ్ లు, ఉంగరాలు గిఫ్ట్ లుగా ఇస్తున్నారు. తమకు లాభాలు వచ్చాయి కాబట్టి.. దానికోసం కష్టపడిన వారికి కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని నిర్మాతలు అనుకోవడం ఎంతో మంచి విషయం. అయితే హిట్ వచ్చాకా మాట ఇవ్వడం వేరు. సినిమా రిలీజ్ కు ముందే మాట ఇవ్వడం.. అందులోనూ మీడియా ముందు అలాంటి మాట ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. అయితే టాలీవుడ్ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆ పని చేసి ఔరా అనిపించాడు.
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటుడు, డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను కూడా పెంచేసింది. ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ధీరజ్. రాహుల్ కు ఒక హామీ ఇచ్చాడు. రాహుల్ ఎప్పటినుంచో హైదరాబాద్ లో ఉన్నా కూడా వారికి సొంత ఇల్లు లేదని బాధపడుతుండేవాడు. ఇద్దరు ఆడపిల్లలతో చాలా కష్టాలు పడుతున్నాడు. ఇప్పటివరకు ఒక సొంత ఇల్లు కూడా లేదండి.. కనీసం ఈ సినిమా హిట్ అయితే.. నెక్స్ట్ సినిమాకు మంచి రెమ్యూనరేషన్ వస్తే ఒక ఇల్లు కొనుక్కుంటాను అండి. ఇద్దరు ఆడపిల్లలు.. వారిని చూసినప్పుడల్లా ఒక ఇల్లు అయినా ఉంటే బావుండే అనిపిస్తుంది అన్నాడు.
నేను ఇప్పుడు చెప్తున్నా.. ఈ సినిమా హిట్ అయ్యాక.. నేనే మీకు ఒక ఇల్లు తీసి ఇస్తాను. మీ సొంతింటి కల నేను నెరవేరుస్తాను. ఆ తరువాత సినిమా ఎప్పుడైనా చేయండి. మీ సొంతింటి కల నేను నెరవేరుస్తాను.. మీకోసం కాదు.. మీ ఫ్యామిలీ కోసం.. మీ కిడ్స్ కోసం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ధీరజ్ చేసిన హామీ చూసి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మరి ది గర్ల్ ఫ్రెండ్ హిట్ అయ్యి.. రాహుల్ కి ఇల్లును అందిస్తుందో లేదో చూడాలి.