Ind vs Sa: మనకు సోషల్ మీడియాలో కమ్మ, కాపు, చౌదరి కులాలకు సంబంధించిన వారు ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్లు తరచూ పోస్ట్ లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. తెలుగు వాళ్ళు అంటేనే కులం పిచ్చోళ్ళు అని పరాయి రాష్ట్రాల వాళ్ళు నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేలా ఈ సోషల్ మీడియా వార్ ఉంటుంది. కమ్మ, కాపు, చౌదరి సామాజిక వర్గాల మధ్య కొందరు సృష్టించిన వైరం, ఆధిపత్య పోరు గురించి మనకు తెలిసిందే.
Also Read: World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మహిళలకు తగులుతుందా, సెలబ్రేషన్స్ లేకుండానే ?
సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా తాజాగా కాపు, చౌదరి కి సంబంధించిన సామాజిక వర్గాల వైరం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇది ఏకంగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో ఓ దక్షిణాఫ్రికా బౌలర్ కి సంబంధించిన పేరుతో వివాదంగా మారింది.
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ మారిజాన్ కాప్ ని క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఈమె విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో కాప్ కేవలం 33 బంతుల్లో 42 పరుగులు చేసి.. అలాగే ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ని నాశనం చేసి సౌత్ ఆఫ్రికా జట్టును ఫైనల్ కి నడిపించింది. ఇది మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ లో రెండవ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అలాగే ఈ టోర్నమెంట్ లీగ్ దశలో భారత్ పై సౌత్ ఆఫ్రికా జట్టు విజయం సాధించడంలో కాప్ కీలకపాత్ర పోషించింది. ఈమె బ్యాటింగ్ లో నిలబడితే భారీ ఇన్నింగ్స్ లు కూడా అడగలదు. ఐతే మారిజాన్ కాప్ పేరుని ఉపయోగిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు కొందరు ఆకతాయిలు.
Also Read: Womens World Cup 2025: హర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా
ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్ మరిజాన్ కాప్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఆమె పేరును ఉపయోగించి సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు కొందరు ఆకతాయిలు. కాపు అనే పేరు పెట్టుకునే బదులు చౌదరి అని పెట్టుకోవచ్చు కదా..? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇది కాస్త ఫన్నీగా ఉండడంతో పలువురు నెటిజెన్లు సైతం ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది..? అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే..? అది కాపు కాదు.. కాప్.. మరీ ఇలా ఉన్నారు ఏంటయ్యా..? అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.