Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. యానిమల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఒకవైపు ఫుల్ సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతుంటాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఈ అమ్మడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రష్మిక తన తొలి ఆడిషన్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. గోపిలోల కోసం రష్మిక ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ వీడియో చూసి ఇప్పుడు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆమె యాక్టింగ్, మాటలు, అల్లరి నవ్వులు అందరిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఆ వీడియోలో ఆమె చేసిన డ్యాన్స్ కు చాలా క్యూట్ గా ఉంది.. ఇక డైలాగ్ చెప్పాలని డైరెక్టర్ కోరగా.. ఫన్నీగా చెప్పేసింది. తన వయసు 19 ఏళ్లు అని, బీఏ చదువుతుందని చెప్పింది. రష్మిక మందన్న నటించాల్సిన సినిమాలో మిన్ కె చంద్రను ఎంపిక చేశారు. ఆ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో రష్మిక ఆడిషన్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎంత క్యూట్ గా చేసిందో ఒకసారి చూసేయ్యండి.
రష్మిక మందన్న తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు కేవలం పుష్ప సినిమానే నేషనల్ వైడ్ మంచి టాక్ ను అందించింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయం తో కట్టిపడేసింది. పుష్ప సినిమాలో ఆమె న్యాచురల్ లుక్ లో కనిపించింది. పాన్ ఇండియా వైడ్ గా ఆమె అందంతో అభిమానులను సంపాదించుకుంది. ఆమె ప్రస్తుతం స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలను చేస్తుంది. దీంతో ఈ బ్యూటీకి అటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు బాలీవుడ్ లో యానిమల్ సినిమా ఛాన్స్ ను అందుకుంది. ఆ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకుంది. ప్రస్తుతం అర డజను సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె నటించిన ఛావా సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.
View this post on Instagram