Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా మెటబాలిజాన్ని పెంచుతుంది. పండ్లు తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తాయి. సహజ చక్కెరలతో శరీరానికి ఇంధనం ఇస్తాయి. ఇదెలా ఉంటే.. బరువు తగ్గడానికి ఉదయాన్నే ఎలాంటి ఫ్రూట్స్ తినాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్: ఒక ఆపిల్‌లో కేవలం 95 కేలరీలు ఉంటాయి. అంతే కాకుండా 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది పెక్టిన్ అనే ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఆకలిని ఎక్కువసేపు అణచివేస్తుంది. ఉదయాన్నే ఒక ఆపిల్ తింటే రోజంతా తక్కువ ఆహారం తినాలనిపిస్తుంది. ఒక అధ్యయనాల ప్రకారం.. ఆపిల్ తినే వారు బరువు త్వరగా తగ్గుతారు.
బెర్రీస్: ఒక కప్పు స్ట్రాబెర్రీలో 50 కేలరీలు మాత్రమే. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఉదయపు ఓట్‌మీల్ లేదా యోగర్ట్‌తో కలిపి తింటే సూపర్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.
జామకాయ: ఒక సగం జామ కాయలో 52 కేలరీలు ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలను తగ్గించి.. ఫ్యాట్ స్టోరేజ్‌ను నిరోధిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. గ్రేప్ ఫ్రూట్ తినే వారు 3 నెలల్లో 3-4 కేజీలు తగ్గుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మరింత ఫలితాలు ఇస్తుంది.
బత్తాయి: ఒక కప్పు బప్పాయిలో 55 కేలరీలు పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ జీర్ణాన్ని సులభతరం చేస్తుంది. అంతే కాకుండా వీటిలో ఫైబర్ , విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది. ఉదయాన్నే సలాడ్‌గా లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు.
కివీ ఫ్రూట్: రెండు కివీలలో 90 కేలరీలు , 5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది సీరోటోనిన్‌ను పెంచి ఆరోగ్యానికి మెరుగుపుస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి తగ్గి ఎమోషనల్ ఈటింగ్ నివారిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
Also Read: ఐస్ క్యూబ్స్ ఇలా వాడితే చాలు.. ఎంత మాడిన పాత్రలైనా కొత్తవాటిలా మెరుస్తాయ్
అరటిపండు: మధ్యస్థ అరటిలో 105 కేలరీలు. పొటాషియం, రెసిస్టెంట్ స్టార్చ్ ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. ఉదయాన్నే స్మూతీలో కలిపి తాగితే శక్తి లభిస్తుంది కానీ ఎక్కువ తినకూడదు.
నిమ్మకాయ లేదా నారింజ: నిమ్మకాయ నీళ్లు తాగితే డిటాక్స్ అవుతుంది. నారింజలో 62 కేలరీలు, ఫైబర్ ఉంటుంది.
ఈ పండ్లను ఉదయాన్నే తినడం వల్ల మెటబాలిజం 10-20% పెరుగుతుంది. ప్రతి రోజూ 2-3 పండ్లు తినండి. కానీ జ్యూస్‌లకు బదులు ముక్కలుగా తినండి. ఫైబర్ నష్టం కాకుండా.. ప్రోటీన్ (గింజలు, యోగర్ట్)తో కలిపితే మరింత ఫలితం. వ్యాయామం, నీరు తాగడం కలిపితే బరువు త్వరగా తగ్గుతుంది.