AP Politics: ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార కూటమి-విపక్ష వైసీపీ మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ డైనోసార్ లాంటిదన్నారు. జగన్‌కు కనకం, రాజరికం కావాలన్నారు. ఆయన బతుకును ఘోరం చేస్తామన్నారు.
జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
అనేక కేసుల్లో ఆయన ఇరుక్కోబోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన్ని ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం, రాజ్యం తనదే అన్నట్లు వ్యవహరించారన్నారు. భారతీరెడ్డి కోసం రూ,400 కోట్ల బంగారం కొనుగోలు చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆయనకు చెక్ పెట్టబోతున్నట్లు వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో భాగంగా ఈడీ సోదాలు చేసింది. భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టు బయటపడింది.
బుధవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. జగన్-భారతీరెడ్డి ఏ దారుణమైనా పాల్పడుతారని, వివేకాను చంపింది వాళ్లేనని కుండబద్దలు కొట్టేశారు. మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారని వ్యాఖ్యానించారు.
రూ. 400 బంగారు కోనుగోలు, ఎందుకు?
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్‌కు దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. త్వరలో అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమని మనసులోని మాట బయటపెట్టారు. వివేకా కేసు సీబీఐ దర్యాప్తు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము జగన్‌ను వేటాడుతామని, ఆయనకు అధోగతి తప్పదన్నారు.
వివేకా హత్య కేసులో ఎంతోమంది పాత్ర ఉందని, అసలు దోషులు దాగున్నారని తేల్చిచెప్పారు. వారి కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సూచించారు. వివేకాను తాను-బీటెక్ రవి-సతీష్ రెడ్డి కలిసి చంపామని ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైసీపీ నేతలు
లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజలే కాదు చెల్లెళ్లు చేత ఛీ కొట్టించుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు డబ్బులు, పదవి ఉంటే చాలన్నారు. ధర్మం, న్యాయం వంటివి ఆయనకు అవసరం లేదన్నారు. అందుకే పద్దతి లేకుండా మాట్లాడుతున్నారని రుసరుసలాడారు. ధర్మ సంస్కృతి కూటమి ప్రభుత్వానిదైతే, ధర్మ వికృతి జగన్ తీరుగా వర్ణించారు.
ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి.. జగన్‌ను ఈ స్థాయిలో మాట్లాడిన సందర్భం లేదని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడడంతో తెర వెనుక ఏదో జరుగుతోందని వైపీసీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి రేపటి రోజున వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.