shobha shetty (1)
Shobha Shetty Latest Photos: బిగ్ బాస్ బ్యూటీ, నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్లో మోనితగా నెగిటివ్ షేడ్‌లో కనిపించింది.
shobha shetty (2)
ఇందులో విలనీజం చూపిస్తూ తనదైన నటనతో మెప్పించింది. కార్తీక దీపం సీరియల్‌కు అంతగా ప్రజాదారణ పొందాడానికి మోనిత పాత్ర కీలకమని చెప్పడంలో సందేహం లేదు. అంతగా శోభా శెట్టి తనదైన నటనతో ఆకట్టుకుంది.
shobha shetty (3)
బుల్లితెరపై మోనితగా గుర్తింపు పొందింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టిన ఈ భామ తనకు ఉన్న మార్క్‌ను పొగొట్టుకునే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ హౌజ్‌లో తనదైన పర్ఫామెన్స్ మోనిత నుంచి శోభా శెట్టిగా ఫేమస్ అయ్యింది.
shobha shetty (4)
హౌజ్‌లో గొడవలు, వివాదాలు, టాస్క్‌ల్లో ఆమె చూపించే స్వార్థం.. ఇలా ప్రతిదీ బుల్లితెర ఆడియన్స్‌ని కోపం తెప్పించేది. తనే గెలవాలనే స్వార్థం.. దానికి కోసం కో-కంటెస్టెంట్స్ ఆమె వాదించే పద్దతికి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
shobha shetty (5)
బిగ్ బాస్ షో ద్వారా ఆమె ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంది. అయిన కూడా ఈ ముద్దుగుమ్మ తగ్గేదే లే అంటూ దూసుకుపోయింది. బిగ్ బాస్ హౌజ్‌లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది.
shobha shetty (6)
కార్తీక దీపం సీరియల్ నటుడు యశ్వంత్‌తో ఆమె ఎంతోకాలంగా డేటింగ్లో ఉంది. ఈ విషయాన్ని హౌజ్‌లో బయటపెట్టింది. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పింది.
shobha shetty (7)
అన్నట్టుగానే షో నుంచి బయటకు రాగానే నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ఇంతవరకు పెళ్లి కబురు చెప్పలేదు. దీని కోసం ఆమె అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
shobha shetty (8)
బిగ్ బాస్ తర్వాత మోనిత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఆమె ఒక్క సీరియల్ కూడా సైన్ చేయలేదు. కనీసం సినిమాల్లో కూడా నటించడం లేదు.
shobha shetty (9)
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ సందడి మామూలుగా లేదు. తరచూ చీరలో ఫోటోషూట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
shobha shetty (10)
రంగురంగుల చీరలలో హరివిల్లులా వయ్యారాలు పోయింది శోభా. ఈ ఫోటోలో ఆమె చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సారీ క్వీన్, మోస్ట్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
shobha shetty (11)
ఈ డిజిటల్ ప్రింట్ సిల్క్ శారీలో శోభా అందాలకు కుర్రకారు మెస్మరైజ్ అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.