Asia Cup 2025: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం ఆగస్టు 19న భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ని ఎంపిక చేశారు. అయితే శుబ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడంతో గిల్ కి తుది జట్టులో ప్లేస్ ఖాయమైనట్టే అని చెప్పవచ్చు. కానీ టాపార్డర్ బ్యాట్స్ మెన్ లలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్నీ పక్కకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శుబ్ మన్ గిల్ వీరికి అడ్డంకిగా మారాడు. అటు అభిషేక్ శర్మ ఐసీసీ నెంబర్ 1 ర్యాంకర్ గా ఉన్నారు. మరోవైపు సంజు శాంసన్ గత 10 టీ’0 మ్యాచ్ ల్లో 3 సెంచరీలు చేశాడు. ఇక తిలక్ వర్మ కూడా లాస్ట్ 7 టీ-20 మ్యాచ్ ల్లో 2 సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు.
Also Read : IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !
తుది జట్టులో అభిషేక్ శర్మకి నో ఛాన్స్..?
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టీమిండియా టాపార్డర్స్ బ్యాటర్లలో ఎవ్వరినీ పక్కకు పెట్టాలో అర్థం కాకుండా పోయింది. శుబ్ మన్ గిల్ ఎంపిక టీమిండియా కి దరిద్రం అనే చెప్పవచ్చు. తుది జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ కి ఛాన్స్ దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అభిషేక్ శర్మ తుదిజట్టులో లేకుంటే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో టీమిండియా ఓటమి చెందడం ఖాయమని కొంత మంది క్రికెట్ అభిమానులు పేర్కొనడం గమనార్హం. మరోవైపు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. శుబ్ మన్ గిల్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే టీ-20 జట్టులోకి రీ ఎంట్రి ఇచ్చారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు చోటు లభించింది.
ఆ ముగ్గురు బెంచ్ కే పరిమితం
అయితే ఈ 15 మంది ఆటగాళ్లలో తుది జట్టులో ఆడే ఆటగాళ్లు ఎవ్వరు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది..? ఎవ్వరికీ మొండి చేయి ఎదురవుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిలో ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు మాత్రం టోర్నీ మొత్తం బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నీ మొత్తం వారు వాటర్ బాయ్స్ గా జట్టుకు సేవలందించనున్నారు. వారిలో శివమ్ దూబె, హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఈ ముగ్గురికి కూడా తుది జట్టులో చోటు దక్కదని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు కొందరేమో సంజు శాంసన్ కూడా బెంచ్ కి పరిమితం అవుతాడని.. అందుకే వికెట్ కీపర్ గా జితేశ్ శర్మను ఎంపిక చేశారని వార్తలుకూడా వినిపించడం గమనార్హం.