సినిమా హీరోలు, హీరోయిన్ల పట్ల చాలా మందికి అభిమానం ఉంటుంది. వారిలా కనిపించేందుక ప్రయత్నిస్తుంటారు. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ వారిలాగే ఉండేలా చూసుకుంటారు. కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఓ యువకుడు తన పైత్యాన్ని భార్య మీద చూపించి చివరకు కటకటాలపాలయ్యాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఉత్తర ప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన శివం ఉజ్వల్ అనే ఉపాధ్యాయుడి ఈ ఏడాది మార్చిలో పెళ్లి అయ్యింది. కొద్ది రోజులు భార్యభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలయ్యింది. శివంలోని రంగులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తనకు బాలీవుడ్ నటి నోరా ఫతేహి అంటే ఇష్టమని, ఆమెలా ఫిట్ గా ఉండాలంటూ బలవంతం చేయడం మొదలు పెట్టాడు. ఫుడ్ పెట్టకుండా గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేయిస్తూ టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. అతడి నుంచి తనను కాపాడాలని ఖాళీలను వేడుకుంది.
కంప్లైంట్ లో ఆమె ఏం చెప్పిందంటే?
మురాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదులో.. ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన తన భర్త శివం ఉజ్వల్.. తనను నోరా ఫతేహిలా కనిపించాలంటూ టార్చర్ చేశాడని చెప్పుకొచ్చింది. “ప్రతిరోజూ మూడు గంటలు వ్యాయామం చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఒకవేళ ఎప్పుడైనా 3 గంటలు వ్యాయామం చేయలేకపోతే, ఆ రోజు ఫుడ్ పెట్టేవాడు కాదు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందని తిట్టేవాడు. నోరా ఫతేహి లాంటి అందమైన అమ్మాయిని చేసుకోవాలని ఉన్నా, అవనసరంగా నన్ను పెళ్లి చేసుకున్నానని మాటలతో హింసించేవాడు. ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటాడు. ఇంటర్నెట్ లో అమ్మాయిల అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చూస్తాడు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు, నాకు తెలియకుండా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. నేను సాధారణ ఎత్తు, తెల్లని రంగుతో ఉంటాను. అయినప్పటికీ తన భర్త, అత్తమామలు తనను బాడీ షేమించే చేసేవారు. ఎగతాళిగా మాట్లాడేవారు” అని చెప్పుకొచ్చింది.
Read Also: గోల్డెన్ నర్స్ షార్క్.. ఫస్ట్ టైమ్ కనిపించింది బ్రో!
వరకట్నం వేధింపులు కూడా..
పెళ్లి తర్వాత కొద్ది రోజుల నుంచే అత్తమామలు అదనపు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని బాధిత మహిళ చెప్పుకొచ్చింది. అదనపు కట్నం తీసుకురాకపోవడం తనను వాళ్లు మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి సమయంలో తన కుటుంబం రూ.16 లక్షల విలువైన నగలు, రూ.24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ.10 లక్షల నగదును కట్నంగా ఇచ్చారని చెప్పింది. అయినా తనను వేధించడం మొదలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళ భర్త, అత్త, మామ, వదిన మీద కేసు నమోదు చేశారు.
Read Also: 28వ అంతస్తులో ఆవు దూడ.. భలే పెంచుతున్నారే!