Allu Arjun : అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనక రత్నమ్మ (94) (Allu Kanakaratnamma)వృద్ధాప్య సమస్యల కారణంగా నిన్న మరణించారు. ఇలా కనక రత్నమ్మ మరణించడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా అల్లు ఇంటికి చేరుకొని కనక రత్నమ్మ గారికి నివాళులు అర్పించారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగా కుటుంబ సభ్యులు మెగా హీరోలందరూ కూడా అల్లు ఇంటికి చేరుకొని కనక రత్నమ్మకు నివాళులర్పించారు. ఇక ఈమె అంత్యక్రియలు కోకాపేటలోనే అల్లు వ్యవసాయ క్షేత్రంలో ముగిసాయి.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…
ఇకపోతే కనక రత్నమ్మ మరణ వార్త తెలియగానే చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మొదటిసారి అల్లు అర్జున్(Allu Arjun) సైతం నానమ్మ మరణం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ.. “మా ప్రియమైన నాన్నమ్మ అల్లు కనక రత్నమ్మ స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఉనికి, ప్రేమ, ఆప్యాయతను ప్రతిరోజు మిస్ అవుతామని, నాన్నమ్మ మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చిన వారికి, కొంతమంది దూరంగా ఉన్నప్పటికీ వారి ప్రార్థనలు మాపై చూపించినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ అల్లు అర్జున్ తన నాన్నమ్మ కనక రత్నమ్మ ఫోటోని షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అల్లు ఇంటికి పవన్ కళ్యాణ్…
ఇక వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈమె మరణించారని తెలుస్తుంది. ఇక ఈమె మరణం తర్వాత తన కళ్లను కూడా దానం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. ఇక కనక రత్నమ్మ చివరి చూపుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హాజరు కాలేకపోయారు. ఆయన రాజకీయ షెడ్యూల్ కారణంగా హాజరుకాని నేపథ్యంలో రాజకీయ వ్యవహారాలు పూర్తి అయిన వెంటనే నేరుగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు కనక రత్నమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Our beloved grandmother #AlluKanakaratnam garu now rests in her heavenly abode. Her love, wisdom, and presence will be missed every single day.
Heartfelt thanks to everyone who came forward to share their affection and condolences. To those far away, your prayers and love were… pic.twitter.com/wT3KNETNNl
— Allu Arjun (@alluarjun) August 31, 2025
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కనక రత్నమ్మ మరణ విషయం తెలియగానే మెగా కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన అల్లు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒకే ఫ్రేమ్ లో మెగా అల్లు హీరోలు కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నానమ్మ మరణించడంతో ఆయన తన సినిమా షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ (Atlee)డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా ముంబైలో శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు ఈ సినిమాకు అల్లు అర్జున్ బ్రేక్ ఇచ్చారు.
Also Read: Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్ పై బాలయ్య క్లారిటీ.. అప్పుడే షూటింగ్ ప్రారంభం!