Sobhita Photos: సినీ సెలబ్రిటీల పెళ్లి అంటే గ్రాండ్‌గా డెకరేషన్ ఉండాలి, డెస్టినేషన్ వెడ్డింగ్ జరగాలి, అంగరంగ వైభవంగా జరగాలి. అందులో సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయా అనేదే అతిపెద్ద ప్రశ్న. కానీ నాగచైతన్య, శోభితా పెళ్లి అలా కాదు. (Image Source: Sobhita/Instagram)
తన పెళ్లిని తెలుగింటి సాంప్రదాయాలతో చేసుకోవాలని ఉందని ఎన్నోసార్లు బయటపెట్టింది శోభితా. (Image Source: Sobhita/Instagram)
తను చెప్పినట్టుగానే తెలుగింటి సాంప్రదాయాలతోనే తన పెళ్లి పనులు మొదలుపెట్టింది శోభితా ధూళిపాళ. (Image Source: Sobhita/Instagram)
ఇప్పటికే పసుపు దంచడం ఫార్మాలిటీ పూర్తయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Sobhita/Instagram)
తాజాగా నాగచైతన్య, శోభితా మంగళస్నానాలు జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇంతలోనే శోభితా కూడా ఆ ఫోటోలను స్వయంగా షేర్ చేసింది. (Image Source: Sobhita/Instagram)
రాత స్థాపన, మంగళస్నానాలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది శోభితా ధూళిపాళ. (Image Source: Sobhita/Instagram)
నాగచైతన్య, శోభితా పెళ్లి డేట్ గురించి ఇంకా బయటికి రాలేదు. కానీ పెళ్లి పనులు మాత్రం మొదలయ్యాయి. (Image Source: Sobhita/Instagram)
ఇటీవల నాగచైతన్య, శోభితా పెళ్లి కార్డ్ ఇదేనంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది కానీ అది నిజమా కాదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. (Image Source: Sobhita/Instagram)
మామూలుగా అందరూ సినీ సెలబ్రిటీలు లాగానే నాగచైతన్య, శోభితా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని అందరూ అనుకున్నా అది జరగడం లేదనే క్లారిటీ వచ్చేసింది. (Image Source: Sobhita/Instagram)
అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెద్ద సెట్ వేసి నాగచైతన్య, శోభితా పెళ్లిని గ్రాండ్‌గా చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. (Image Source: Sobhita/Instagram)
సమంతతో విడాకుల తర్వాత శోభితా లాంటి మరో హీరోయిన్‌తో నాగచైతన్య ప్రేమ, పెళ్లి అని ఎవరూ ఊహించలేదు. (Image Source: Sobhita/Instagram)
మొత్తానికి నాగచైతన్య, శోభితా పెళ్లి జరిగిపోతుందని చాలామంది ప్రేక్షకులు షాకవుతున్నారు. అలాగే విషెస్ కూడా చెప్తున్నారు. (Image Source: Sobhita/Instagram)