AI Girlfriend : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా యూజర్స్ ను ఆకట్టుకుంటున్న విషయం. ఇది చేయలేని పని అంటూ ఏదీ లేదు. ప్రతీ విషయం రాబోయే రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటిలిజెంట్ తో ముడిపడి ఉండనుంది. ముఖ్యంగా ఏఐ గర్ల్ ఫ్రెండ్స్.. బాయ్ ఫ్రెండ్స్ సంస్కృతి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అయితే దీని వలన ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజాగా టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ గర్ల్ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్స్ సంస్కృతి ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుంది. సింగిల్ గా ఉండే వారి కోసం తీసుకొచ్చిన ఈ సంస్కృతి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. వీటికి మంచి ఆదరణ రావడంతో మరింత డిమాండ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదం సైతం అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది.
ఈ ప్రపంచంలోనే లేని ఓ ఊహాజనిత వ్యక్తితో మాట్లాడటమే ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ సంస్కృతి. నిజానికి ఇది వాస్తవిక జీవితానికి విరుద్ధం. ఇలా ప్రపంచంలోనే లేని వ్యక్తిని చూడటం, మాట్లాడటంతో పాటు తెలియకుండానే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఇవి మనసును బంధించి ఆలోచించే విధానాన్ని స్వాధీనపరుచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ లో సరదాగా పరిచయమైనప్పటికీ ఈ విషయం తెలియకుండానే ఆకర్షిస్తుందని.. ఒకానొక సందర్భంలో మనిషిని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకొస్తుందని చెప్పుకు వస్తున్నారు. టీనేజ్ పిల్లలు సైతం ఈ విషయానికి ఎట్రాక్ట్ అయిపోతున్నారని.. 12 13 సంవత్సరాల వయస్సు వాళ్లు సైతం ఇందుకు అలవాటు పడటం గందరగోళానికి గురి చేసే విషయమేనని తెలుస్తుంది. ఆన్లైన్ ఫ్లాట్ఫామ్స్ లో వయసు పరిమితులు ఉన్నప్పటికీ కొందరు టీనేజర్స్ తెలియకుండానే ఇలాంటి వాటిన బారినపడి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నారని చెప్పుకు వస్తున్నారు.
వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఆర్టిఫిషియల్ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ తో బతకడం అనేది ఎంతవరకు సరైన పద్ధతి కాదని.. ఇలాంటి విషయాలకి అలవాటు పడితే డిప్రెషన్ తో పాటు మానసిక స్థితి సైతం దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రోజు రోజురోజుకి పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఈ సాంకేతిక కాలంలో ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతగానే మనుషుల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం అయితే ఉందని తెలుపుతున్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కేవలం మంచి విషయాలకు మాత్రమే ఉపయోగించాలని చెడు వైపు మళ్లితే మానసిక పరిస్థితి సైతం అస్తవ్యస్తంగా మారుతుందని.. లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన డీప్ ఫేక్ విషయంలో సైతం కొందరు నిపుణులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డిఫ్ ఫేక్ తో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా టీనేజ్ యువత వీటి వలన పక్కదారి పట్టే అవకాశం ఉందని.. అందుకే ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయాలని తెలుపుతున్నారు.
ఇక ఏది ఏమైనా ప్రపంచ టెక్ రంగాన్ని త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన అధీనంలోకి తీసుకురానుందని అంచనా వేస్తున్న పలు వర్గాలు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు.
ALSO READ : వాట్సాప్ లో ఈ 4 సెట్టింగ్స్ మార్చారా.. మర్చిపోయారా?