Varun Tej (Source : Instagram)
మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. మెగా ఇంటికి వారసుడొచ్చాడు అంటూ అటు అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
Varun Tej (Source : Instagram)
గత ఏడాది తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది ఈ జంట.
Varun Tej (Source : Instagram)
ఎట్టకేలకు సెప్టెంబర్ 10 బుధవారం నాడు లావణ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన భార్య, కొడుకుతో కలిసి తీసుకున్న క్యూట్ ఫోటోని వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
Varun Tej (Source : Instagram)
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా మనవడు పుట్టిన సందర్భంలో సినిమా షూటింగ్ సెట్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి..ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. ఆ చిన్నారిని తన చేతుల్లోకి ఎత్తుకొని సంబరపడిపోతున్న ఫోటోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
Varun Tej (Source : Instagram)
పంచుకుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూడా వారసుడిని ఆహ్వానిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు క్లీంకారకు బుల్లి తమ్ముడు వచ్చేసాడు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Varun Tej (Source : Instagram)
మొత్తానికైతే మెగా కుటుంబంలోకి వారసుడి రాక ఆ ఇంటి ఆనందాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.