Ramya Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రమ్యకృష్ణ(Ramya Krishna) ఒకరు.. ఒకానొక సమయంలో ఈమె భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు. ఇలా హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న తరుణంలోనే రమ్యకృష్ణ విలన్ పాత్రలలోను అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ద్వారా కూడా రమ్యకృష్ణ ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ విధంగా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈమె శివగామి పాత్రలో అద్భుతంగా నటించారు.. అయితే ఈ శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందుగా సీనియర్ దివంగత నటి శ్రీదేవి(Sri Devi)ని చిత్ర బృందం సంప్రదించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలవల్ల శ్రీదేవి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో రమ్యకృష్ణ శివగామి(Shivagami) పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
ఇకపోతే తాజాగా శివగామి పాత్ర గురించి జగపతిబాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో రమ్యకృష్ణ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. శివగామి పాత్ర నాకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని తెలిపారు. అయితే శ్రీదేవి గారు అంటే తనకు చాలా ఇష్టమని రమ్యకృష్ణ తెలిపారు. శ్రీదేవి ఇష్టమైనప్పుడు ఆమె నటించాల్సిన శివగామి పాత్ర మీరెందుకు చేశారు అంటూ జగపతిబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ శ్రీదేవి గారు రిజెక్ట్ చేస్తే నన్నేం చేయమంటారు. ఇలా ఆవిడ రిజెక్ట్ చేయడంతోనే శోబు గారు నాకు ఫోన్ చేసి మీవి బాహుబలి సినిమా కోసం 40 కాల్ షీట్స్ కావాలని చెప్పారు. ఆ మాట చెప్పగానే కుదరదని ఫోన్ కట్ చేసినట్టు రమ్యకృష్ణ తెలిపారు.
రమ్యకృష్ణను తప్ప మరెవరిని ఊహించుకోలేం..
ఇక చివరికి శివగామి పాత్రలో తానే చేయాల్సి వచ్చిందని, బాహుబలి సినిమాలో భాగం కావడం నిజంగా తన అదృష్టం అని తెలిపారు. నా జీవితంలోనే శివగామి పాత్ర ఓ మ్యాజిక్ అంటూ వెల్లడించారు. ఇదే విషయం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రమ్యకృష్ణ శివగామి పాత్ర చేయడం అనేది డెస్టిని. ఈ పాత్రలో ఆమెను తప్ప మరెవరిని ఊహించుకోలేమంటూ వెల్లడించారు.. ఇలా శివగామి పాత్రలో రాజమాతగా రమ్యకృష్ణ తన నటనతో అదరగొట్టారు. ఇక బాహుబలి సినిమా రెండు భాగాలు తిరిగి బాహుబలి ది ఎపిక్ పేరిట ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది.
Also Read: Subha shree -Ajay Mysore: నిర్మాత అజయ్ మైసూరా.. శుభశ్రీ హాల్ది వేడుకలు..ఫోటోలు వైరల్!