Madhya Pradesh News: అదృష్టం అనేది.. ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. కాకపోతే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆవిరైపోతుంది. సరిగ్గా నోటరీ లాయర్ విషయంలో అదే జరిగింది. ఊహించకుండా ఆయన అకౌంట్లో వేల కోట్లు వచ్చిపడ్డాయి. ఆ క్షణాల్లో ఆయన బిలియనీర్‌గా మారిపోయాడు. అసలు మేటరేంటి?
కుబేరుడైన నోటరీ లాయర్
మధ్యప్రదేశ్‌లోని ధన్మోడ్ పట్టణంలో వినోద్ డోంగ్లే నోటరీ లాయర్. అంతేకాదు ప్రైవేట్ పాఠశాల యజమాని కూడా. ఆయన కొద్దిసేపు అంటే కొన్ని నిమిషాల పాటు కుబేరుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ మనీ కూడా పోయింది. లక్ష్మి ఎలా వచ్చిందో.. అలాగే పోయింది. అసలు విషయం ఏంటి?
కాస్తో కూస్తూ చదువుకున్నవారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. దానికి డీ మ్యాట్ అకౌంట్ తీసుకుంటున్నారు. నెలయ్యేసరికి మిగిలిన కొద్దిపాటి మనీని షేర్లలో పెట్టుబడి పెడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని నోటరీ లాయర్ వినోద్ డోంగ్లే కూడా అదే చేశాడు. శుక్రవారం ఆయన డీమ్యాట్ అకౌంట్‌లో ఏకంగా రూ.2817,41,29,408 బ్యాలెన్స్ కనిపించింది. దాంతో ఒక్కసారిగా ఆయన షాకయ్యాడు.
క్షణాల్లో లాయర్ ఆనందం ఆవిరి
ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బిలియనీర్ అయిపోయాడు. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ప్రపంచంలోని లాటరీలన్ని గెలుచు కున్నాననే భావన కలిగింది. క్షణాల్లో ఆ తప్పును సంబంధిత వర్గాలు సరిదిద్దాయి. చివరకు వినోద్ తాత్కాలిక బిలియనీర్ స్టేటస్ మారిమైపోయింది.
శుక్రవారం ఉదయం న్యాయవాది వినోద్, శుక్రవారం పెట్టుబడికి మంచిదని భావించి తన డీమ్యాట్ ఖాతా చూశాడు. ఆయన ఖాతాలో ఒక్కసారిగా రూ. 2,817 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపింది. అతడి పోర్ట్ ఫోలియోలో హర్సిల్ ఆగ్రో లిమిటెడ్‌లోని 1,312 షేర్లు కనిపించాయి.
ALSO READ: గొల్కొండ డైమండ్.. ఫ్రెండ్ దాకా ఎలా వెళ్లింది?
ఒక్కో షేరుకు రూ. 2.14 కోట్లు. వాటి మొత్తం విలువ రూ. 28,17,41,29,408. ఆ క్షణం తన జీవితం శాశ్వతంగా మారిపోయిందని భావించాడు. భూమిపై ఉన్న ప్రతి లాటరీని గెలిచినట్లు అనిపించిందని నవ్వాడు. సిస్టమ్ లోపం కారణంగా అది జరిగిందని, కొద్దిసేపు తర్వాత తెలుసుకున్నాడు. క్షణాల్లో ఆయన ఆనందం ఆవిరైపోయింది.
టెక్నాలజీ యుగంలో ఈ తరహా మ్యాజిక్ ట్రిక్ ఒక్కసారి జరుగుతుందని చెప్పాడు. ఈ లోపం గురించి తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ఈ లోపానికి కారణం అస్పష్టంగానే ఉన్నప్పటికీ, తాత్కాలిక సిస్టమ్ లోపాలు లేదా స్టాక్ మార్కెట్ డేటాబేస్‌లలో డేటా అసమతుల్యత కారణంగా ఇలాంటివి జరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అల్గోరిథమిక్ లోపాల కారణంగా ఈ విధంగా ప్రదర్శించబడతాయని అంటున్నారు.