Yellamma: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు (Venu)సినిమాలపై ఆసక్తితో వెండితెరపై కూడా పలు సినిమాలలో కమెడియన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే వేణు మొదటిసారి డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన బలగం(Balagam) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాత దిల్ రాజు వేణుకి మరొక సినిమా అవకాశం ఇచ్చారు.
బలగం సినిమాకు దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే దిల్ రాజు తన సొంత బ్యానర్లో వేణు రెండవ సినిమాకు అవకాశం కల్పించారు. ఇప్పటికే వేణు ఎల్లమ్మ(Yellamma) అనే టైటిల్ తో అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారు అయితే ఈ సినిమాని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా సినిమాలో చేయడానికి హీరోలు దొరకని నేపథ్యంలో ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఎల్లమ్మ సినిమా కథను రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్లమ్మ సినిమా పట్ల అభిమానులు కూడా ఆసక్తి తగ్గించుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు (Devi Sri Prasad)వేణు ఎల్లమ్మ సినిమా కథ వినిపించడంతో ఈ కథ నచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇలా ఎల్లమ్మ సినిమాకు హీరోగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా దేవిశ్రీప్రసాద్ వ్యవహరించబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వేణు వెల్లడించారు తన కుమార్తె పుట్టు వెంట్రుకల కోసం తిరుమలకు వెళ్లిన వేణు అక్కడ మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమా గురించి రెండు మూడు వారాలలో అధికారక ప్రకటన రాబోతుందని తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ కు జోడిగా కీర్తి సురేష్..
ఇలా రెండు మూడు వారాలలో సినిమాని అధికారకంగా ప్రకటించడమే కాకుండా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ జరుగుతుందని వేణు తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కు జోడిగా కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా నటించబోతుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్డేట్ వేణు వెల్లడించడంతో ఎల్లమ్మ సినిమాకు ఉన్న అడ్డంకులని తొలగిపోయాయని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని స్పష్టం అవుతుంది.
Also Read: Ramya krishna: శివగామి పాత్రను మిస్ చేసుకున్న శ్రీదేవి.. రమ్యకృష్ణ రియాక్షన్ ఇదే!