Subha Shree -Ajay Mysore: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పెళ్లి భాజలు మోగుతున్న సంగతి తెలిసిందే.. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది తల్లితండ్రులు కాబోతున్నాము అంటూ అభిమానులకు శుభవార్తలను తెలియజేస్తున్నారు. ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన శుభవార్తలు వరుసగా బయటకు రావడం విశేషం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న నారా రోహిత్, నటి సిరి వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అక్టోబర్ 30వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతోంది.
వీరి పెళ్లి ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. తాజాగా వీరి హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా మరో జంట కూడా హల్దీ వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన వారిలో అజయ్ మైసూర్(Ajay Mysore) ఒకరు. అజయ్ మైసూర్ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి శుభశ్రీ రాయగురు(Subha Shree Rayaguru)తో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది జూన్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం(Engagment) జరుపుకున్నారు. ఇలా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఇక వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే వివరాలను వెల్లడించలేదు కానీ తాజాగ వీరి హల్దీకి (Haldi) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. అజయ్ శుభశ్రీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా హల్దీ వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో వీరి పెళ్లికూడా త్వరలోనే జరగబోతుందని తెలుస్తోంది కానీ ఇప్పటివరకు పెళ్లి తేదీ గురించి అధికారక ప్రకటన మాత్రం వెలుబడ లేదు.
అజయ్ శుభశ్రీ ప్రేమ వివాహం..
ఇక అజయ్ మైసూర్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన నిర్మాణంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంతేకాకుండా ఈయన 50 కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేయడమే కాకుండా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇలా నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన శుభ శ్రీతో కలిసి ఒక ఆల్బమ్ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. ఇక పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక తాజాగా పెళ్లి వేడుకలను కూడా ప్రారంభించారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే హల్దీ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఇలా శుభశ్రీ అజయ్ మైసూర్ ను వివాహం చేసుకోబోతున్నారనే విషయం తెలిసి ఎంతోమంది ఈ జంటపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.