BigTV English
Advertisement

Samantha: 1980ల నాటి కథతో.. సమంత కొత్త సినిమా షూటింగ్ మొదలు!

Samantha: 1980ల నాటి కథతో.. సమంత కొత్త సినిమా షూటింగ్ మొదలు!

Samantha:తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ‘ ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది సమంత(Samantha). జెస్సీ పాత్రతో అభిమానుల హృదయాలను దోచుకుంది. కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తర్వాత వరుస పెట్టి చిత్రాలలో నటించిన ఈమె ఒకవైపు గ్లామర్ గా నటిస్తూనే.. మరొకవైపు పల్లెటూరి అమ్మాయి పాత్రలలో కూడా ఒదిగిపోయి మరీ నటించింది. తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్న ఈమె.. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్లకే విడిపోయింది.


మా ఇంటి బంగారం మూవీ తో రాబోతున్న సమంత..

విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత.. మయోసైటీస్ వ్యాధి భారిన పడి విదేశాలలో చికిత్స తీసుకొని ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇచ్చి మళ్ళీ కం బ్యాక్ ఇచ్చేసింది. అందులో భాగంగానే “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే బ్యానర్ స్థాపించి కొత్తవారితో ‘శుభం’ అనే సినిమా నిర్మించింది. ఇందులో మాయ అనే పాత్రలో కూడా నటించింది సమంత. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో కూడా సక్సెస్ సాధించింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే బ్యానర్ పై మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సమంతా లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఓ బేబీ చిత్రానికి దర్శకత్వం వహించిన నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదలైన షూటింగ్..

ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. గత నెల రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ అప్డేట్ పై క్లారిటీ ఇచ్చింది సమంత. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమా షూటింగు తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది. ఇందులో సమంతతో పాటు ఇతర నటీనటులపై నందిని రెడ్డి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 1980 ల నేపథ్యం కలిగిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సమంతను మునుపెన్నడు చూడని విధంగా మొదటి సారి చూడబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సమంతాకు ఒక ప్రత్యేకతను కల్పిస్తూ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని నందిని రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


ALSO READ:Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

సమంత తదుపరి చిత్రాలు..

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది సమంత. అందులో భాగంగానే ఇప్పుడు రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మిగతా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

Related News

Yellamma: ఎల్లమ్మ సినిమాపై అప్డేట్ ఇచ్చిన వేణు.. అడ్డంకులు తొలగిపోయినట్టేనా?

Ramya krishna: శివగామి పాత్రను మిస్ చేసుకున్న శ్రీదేవి.. రమ్యకృష్ణ రియాక్షన్ ఇదే!

Subha shree -Ajay Mysore: నిర్మాత అజయ్ మైసూర్.. శుభశ్రీ హాల్ది వేడుకలు..ఫోటోలు వైరల్!

Bhuvan Gowda: ఘనంగా సలార్ మూవీ కెమెరామెన్ పెళ్లి.. ముఖ్య అతిథి ఎవరంటే?

Shahrukh Khan: బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న 5 చిత్రాలు.. ఏవి?ఎప్పుడంటే?

Janhvi Kapoor: పురుషాహంకారంపై జాన్వీ కామెంట్స్.. తనకు కూడా తప్పలేదన్న ట్వింకిల్!

Madonna Sebastian: ఆ వ్యత్యాసం తెలిస్తే చాలు.. నాకు సలహా ఇవ్వకండి

Big Stories

×