SIP Investment: చిన్నదో, పెద్దదో ఎంతో కొంత మొత్తంలో ముందుగా పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న మొత్తంలోనైనా ముందుగా పెట్టుబడి ప్రారంభించడం మంచిదా లేదా పెద్ద మొత్తాలను ఒక్కసారి పెట్టుబడి పెట్టగలిగే వరకు వేచి ఉండాలా? ఈ ప్రశ్న ఈజీగా కనిపిస్తుంది, కానీ సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఉదాహరణకు ఇద్దరు పెట్టుబడిదారులు సత్య, హర్ష SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. సత్య నెలకు రూ.15,000 చొప్పున 20 సంవత్సరాలు SIPలో పెట్టుబడి పెడితే, హర్ష ఐదు సంవత్సరాలు తన సమయాన్ని వృధా చేసి, ఆ తర్వాత చేస్తుంది, ఆపై 15 సంవత్సరాల పాటు నెలకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టారు. ఇద్దరూ దాదాపుగా ఒకే మొత్తాన్ని తమ పెట్టుబడి పెట్టినా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
సత్య, హర్ష సగటున 12% వార్షిక రాబడితో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారనుకుందాం. సత్య నెలకు రూ.15,000 చొప్పున 20 సంవత్సరాలలో రూ.36 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే హర్ష నెలకు రూ.20 వేలు చొప్పున 15 సంవత్సరాలు రూ.36 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే సత్యకు 12 శాతం వార్షిక రాబడితో రూ.1.50 కోట్లు రాగా, హర్షకు రూ.99 లక్షలు వచ్చాయి. హర్ష కంటే సత్యకు రూ.51 లక్షలు అదనపు లాభం వచ్చింది.
మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, మీకు వచ్చే రిటర్న్స్ అంత ఎక్కువగా ఉంటాయి. సత్య SIPలో మొదటి రెండు సంవత్సరాలు పెద్దగా తేడా కనిపించదు, కానీ 10-12 సంవత్సరాల తర్వాత రిటర్న్స్ భారీగా పెరుగుతాయి. 20 ఏళ్లకు లబ్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. సత్య పొందే మొత్తం ఆదాయంలో 40% కంటే ఎక్కువ చివరి ఐదు సంవత్సరాలలో వస్తుంది. దీనికి కారణం పెట్టుబడిపై వచ్చే కాంపౌండింగ్.
హర్ష మొదటి ఐదేళ్లు వృధా చేశారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో SIP ప్రారంభించినా అంతగా లబ్ది పొందలేకపోయారు.
హర్ష వృధా చేసిన సమయాన్ని భర్తీ చేసేందుకు తన SIPను నెలకు రూ.20,000 నుండి రూ.25,000కి పెంచుకోవాలని నిర్ణయించారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టబడం వల్ల వృధా చేసిన సంవత్సరాలకు పరిహారం దక్కుతుందని ఆశించారు.
హర్ష నెలకు రూ.25,000, 15 సంవత్సరాలు పాటు పెట్టుబడి పెట్టగా మొత్తం రూ.45,00,000 అవుతుంది. దీనిపై కాంపౌండింగ్ రూ.1.24 కోట్లకు చేరుతుంది. అయితే సత్య నెలకు రూ.15,000 చొప్పున 20 సంవత్సరాలు మొత్తం రూ.36,00,00 రాబడితో కలిపి రూ.1.50 కోట్లకు చేరుతుంది. హర్ష అదనంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టినప్పటికీ, సత్య కంటే ఇంకా వెనుకబడి ఉన్నారు. అంటే ఎక్కువ కాలం పెట్టుబడి ఎక్కువ లాభాలకు అవకాశం ఉంటుంది. SIPలో పెట్టుబడికి సమయం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Silver Loan: రూటు మార్చిన ఆర్బీఐ, ఇకపై సిల్వర్‌పై కూడా, కస్టమర్లు ఫుల్ ఎంజాయ్
గమనిక : SIPలో పెట్టుబడి వ్యక్తిగత నిర్ణయం. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులు సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. దీంతో బిగ్ టీవీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.