Brock Lesnar: WWE { World Wrestling Entertainment} లెజెండ్ బ్రాక్ లెస్నర్ {Brock Lesnar} గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇతడు 1977 జూలై 12న సౌత్ డకోటాలో జన్మించాడు. లెస్నర్ మిన్నేసోటా విశ్వవిద్యాలయం తరఫున కాలేజీలో రెజ్లింగ్ లో పోటీపడి.. 2000 సంవత్సరంలో ఎన్సీఏఏ డివిజన్ జాతీయ ఛాంపియన్షిప్ ను గెలుపొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి 2002 వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ WWF ని వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైర్మెంట్ WWE గా మార్చారు. ఆ సమయంలో ఇతడు 25 సంవత్సరాల వయసులో WWE తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అదే సమయంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ ను గెలుచుకోవడం ద్వారా మంచి పేరు ప్రత్యతలు సంపాదించాడు. అంతేకాకుండా ఛాంపియన్షిప్ గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే ఆ తర్వాత 2004లో బ్రాక్ లెస్నర్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ {NFL} లో మిన్నేసోట వైకింగ్స్ లో చేరడానికి రెజ్లింగ్ ని వదిలిపెట్టాడు. కానీ ప్రి – సీజన్ సమయంలో జట్టు నుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత 2005లో IWGP లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు.
WWE లోకి రీఎంట్రీ:
2012లో తిరిగి మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సంవత్సరంలో జాన్ సేనాని ఓడించి WWE లో విధ్వంసకర శక్తిగా ఎదిగాడు. అలా తన కెరీర్ లో ఎంతోమంది యోధులను ఓడించి లెజెండ్ గా నిలిచాడు. ఇక 2023 సమ్మర్ స్లామ్ తరువాత బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ లో కనిపించలేదు. దీంతో అతడు ఇక డబ్ల్యుడబ్ల్యుఈ లోకి తిరిగి వచ్చే అవకాశం లేదని అంతా భావించారు. కానీ తాజాగా సమ్మర్ స్లామ్ 2025 కోసం అతడు WWE లోకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం బ్రాక్ లెస్నర్ కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పలు కథనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతని నికర విలువ సుమారుగా $26 మిలియన్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఇతనికి 2006లో రెనా మెరోనాతో వివాహం జరిగింది. వీరికి టర్క్, డ్యూక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లెస్నర్ మీడియాకి, ఇంటర్వ్యూలకి దూరంగా ఉంటాడు. తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టేందుకు ఇష్టపడడు.
బీఫ్ దుకాణం పెట్టుకున్న లెస్నర్:
ఆ మధ్య బ్రాక్ లెస్నర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో లెస్నర్ మరో ఇద్దరితో కలిసి బీఫ్ ని కుక్ చేయడం, ఆ తరువాత దాన్ని తింటూ కనిపించాడు. దీంతో అతడు బీఫ్ దుకాణం పెట్టుకున్నాడని.. ఇక రెజ్లింగ్ కి గుడ్ బై చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అలాగే వైరల్ గా మారిన ఈ వీడియోలో అతడు ఓ గ్యాంగ్ స్టర్ లాగా కనిపిస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం బీఫ్ తినడం మహా పాపం అంటూ మండిపడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">