Bhuvan Gowda:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు శుభవార్తలు చెబుతున్నారు.. ఒకరు బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త బంధంలోకి అడుగు పెడుతుంటే.. మరికొంతమంది తల్లిదండ్రులు అవుతున్నాం అంటూ ఆ శుభవార్తలు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సలార్, కేజీఎఫ్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసి.. తన అద్భుతమైన పనితీరుతో అందరి దృష్టిని ఆకట్టుకున్న భువన్ గౌడ (Bhuvan Gowda) కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు భువన్ గౌడ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కాగా, ముఖ్యఅతిథిగా కేజిఎఫ్ హీరో యష్ (Yash) విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇక్కడ యష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ప్రస్తుతం యష్ కేజీఎఫ్ 1&2 చిత్రాల తర్వాత చేస్తున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. అందులో భాగంగానే అందుకు తగ్గట్టుగా స్టైలిష్ లుక్ లో ఇప్పుడు భువన్ గౌడ పెళ్లిలో కనిపించేసరికి టాక్సిక్ లో ఇదే లుక్ మెయింటైన్ చేయబోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తన లుక్స్ తో అమ్మాయిల హృదయాలు దోచుకుంటున్నారని చెప్పవచ్చు.
also read:Samantha: 1980ల నాటి కథతో.. సమంత కొత్త సినిమా షూటింగ్ మొదలు!
A #KGF reunion at DOP BhuvanGowda’s recent wedding. @TheNameIsYash @PrashanthNeel2 #GarudaRam pic.twitter.com/hiuxdrLn6S
— MADHU DAITHOTA (@madhudaithota) October 26, 2025