E-Paper
Advertisement

Trendy Watches for Men: లగ్జరీ బ్రాండ్లకు ధీటుగా.. బడ్జెట్ ధరలోనే 5 బెస్ట్ OLEVS వాచ్‌లు

Trendy Watches for Men: లగ్జరీ బ్రాండ్లకు ధీటుగా.. బడ్జెట్ ధరలోనే 5 బెస్ట్ OLEVS వాచ్‌లు
Advertisement

Trendy Watches for Men: OLEVS బ్రాండ్ ప్రస్తుతం తక్కువ ధరలో ప్రీమియం లుక్ ఇచ్చే వాచీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్టైలిష్‌గా ఉంటూనే తక్కువ ధరలోనే మంచి వాచ్ కావాలనుకునే పురుషులకు 2026లో OLEVS నుంచి వస్తున్న ఈ 5 వాచీలు, వీటి ప్రత్యేకతలు, డిజైన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. OLEVS రోన్ ఆటోమేటిక్ స్కెలిటన్:
మెకానికల్ వాచీలంటే ఇష్టపడే వారికి ఇది ఫేవరెట్. 2026లో ఈ స్కెలిటన్ డయల్ వాచీలు అత్యంత ట్రెండీగా మారాయి. ఇందులో బ్యాటరీ అవసరం లేదు. మీ చేతి కదలికలతోనే ఇది పనిచేస్తుంది. డయల్ లోపల ఉండే మెకానికల్ పార్ట్స్ కదులుతుంటే చూడటానికి చాలా రిచ్‌గా కనిపిస్తుంది. దీని డయల్ చుట్టూ రోజ్ గోల్డ్ లేదా సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది బిజినెస్ మీటింగ్స్ , ఫార్మల్ వేర్‌కు చక్కగా సరిపోతుంది.

Advertisement

2. OLEVS గ్రెనోబుల్ మూన్ ఫేస్:
ఆకాశంలోని చంద్రుని దశలను చూపే మూన్ ఫేస్ వాచీలు క్లాసిక్ లుక్‌ని ఇస్తాయి. ఇందులో సమయంతో పాటు, పగలు, రాత్రిని సూచించే సూర్య-చంద్రుల గ్రాఫిక్స్ ఉంటాయి. ఇది వాచీకి ఒక ఆర్టిస్టిక్ లుక్‌ను ఇస్తుంది. సాధారణంగా రాయల్ బ్లూ లేదా డీప్ గ్రీన్ డయల్స్‌తో ఇవి వస్తాయి. ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉన్న యువతకు ఇది బెస్ట్ ఛాయిస్.

3.OLEVS క్లాసిక్ లెదర్ క్రోనోగ్రాఫ్:
మీరు ప్రతిరోజూ ఆఫీసుకు లేదా క్యాజువల్ వేర్ పైకి సెట్ అయ్యే వాచీని వెతుకుతుంటే.. ఈ లెదర్ స్ట్రాప్ వాచీ చాలా బాగుంటుంది. బ్రౌన్ లేదా బ్లాక్ క్వాలిటీ లెదర్ స్ట్రాప్‌తో వస్తుంది. ఇందులో మల్టీ-ఫంక్షన్ క్రోనోగ్రాఫ్ (స్టాప్ వాచ్), డేట్ విండో ఉంటాయి. ఇది చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నా, చేతికి పెట్టుకున్నప్పుడు చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది.

Advertisement

4. OLEVS లగ్జరీ గోల్డ్ బిజినెస్ వాచ్:
పూర్తి గోల్డ్ ఫినిషింగ్ వాచీలు ఇష్టపడే వారి కోసం ‘ప్రోవెన్స్’ సిరీస్ అందుబాటులో ఉంది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో ఉండి, బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. నీటిలో తడిసినా రంగు పోకుండా ఉండే IP ప్లేటింగ్ టెక్నాలజీని ఇందులో వాడతారు. పెళ్లిళ్లు, పార్టీలు లేదా గ్రాండ్ ఈవెంట్స్ సమయంలో సూట్ లేదా షేర్వాణీపైకి ఇది అద్భుతమైన రాయల్ లుక్ ఇస్తుంది.

5. OLEVS స్పోర్ట్స్ సిలికాన్ లూమినస్ వాచ్ :
జిమ్ లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసే పురుషుల కోసం ఇది తయారు చేయబడింది. దీనికి సిలికాన్ స్ట్రాప్ ఉండటం వల్ల చెమట పట్టినా పాడవదు. అలాగే.. చీకటిలో మెరిసే లూమినస్ డయల్ ఉండటం వల్ల రాత్రి వేళ కూడా సమయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ కావడంతో వర్షంలో తడిసినా లేదా చేతులు కడిగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

OLEVS వాచీలు ఎందుకు కొనాలి ?
అఫర్డబిలిటీ: రోలెక్స్ లేదా ఇతర ఖరీదైన బ్రాండ్ల మాదిరిగా కనిపించినా.. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

డ్యూరబిలిటీ: స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ , స్టెయిన్‌లెస్ స్టీల్ వాడటం వల్ల ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

స్టైల్: ప్రతి వాచీ ఒక లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. ఇది మీ పర్సనాలిటీని మెరుగు పరుస్తుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×