E-Paper
Advertisement

AC Service charges: ఏసీ సర్వీస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారా? క్లీనింగ్, రీఫిల్లింగ్, రీపేర్లకు.. అయ్యే అసలు ఖర్చు ఇదే!

AC Service charges: ఏసీ సర్వీస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారా? క్లీనింగ్, రీఫిల్లింగ్, రీపేర్లకు.. అయ్యే అసలు ఖర్చు ఇదే!
Advertisement

AC Service charges: వేసవిలో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏసీ మెకానిక్ లకు ఈ కాలంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది తమ పాత ఏసీలను సర్వీసింగ్ చేయిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మెకానిక్ లు అధిక మెుత్తంలో సర్వీసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 2026 లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. ఏసీలో ఏ సమస్యకు ఎంత ఖర్చు అవుతుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏసీ క్లీనింగ్, జనరల్ సర్వీస్

ఏసీలో పేరుకున్న దుమ్ము, దూళిని వదిలించేందుకు చాలా మంది ఈ సర్వీసు చేయిస్తుంటారు. అయితే ఏసీ రకాన్ని బట్టి వీటికి ఛార్జ్ చేసే ధరలు మారుతూ ఉండొచ్చు. బేసిక్ సర్వీస్ విషయానికి వస్తే.. విండో ఏసీకి రూ.400-700 వసూలు చేస్తారు. స్ప్లిట్ ఏసీకి రూ.500-1000 వరకు ఉంటుంది. ఈ సర్వీసులో ఏసీ ఫిల్టర్లు మార్చడం, పైన పేర్కొన్న దుమ్మును తొలగించడం వంటివి చేస్తారు.

డీప్ క్లీనింగ్ లేదా జెట్ వాష్

Advertisement

ఏసీ సర్వీసింగ్ చేసి చాలా కాలం అయినప్పుడు ఏసీ లోపలి భాగాల్లోనూ పెద్ద ఎత్తున దుమ్ము పేరుకుపోతుంది. ఈ సందర్భంలో హై ప్రెజర్ వాటర్ జెట్‌తో లోపలి భాగాలను శుభ్రం చేయాల్సి రావొచ్చు. ఇందుకోసం రూ.900-1,500 వరకు మెకానిక్ లు వసూలు చేస్తారు.

ఫోమ్ క్లీనింగ్ (Foam Cleaning)

ఏసీ కాయిల్స్ లోపల ఏర్పడే మెుండి మురికి లేదా దుమ్మును వదిలంచడానికి ఫోమ్ క్లీనింగ్ ఆప్షన్ ను మెకానిక్స్ ఉపయోగిస్తుంటారు. ఈ ప్రత్యేక పద్ధతికి కోసం రూ.500 నుంచి రూ.800 అదనంగా వసూలు చేయవచ్చు.

గ్యాస్ రీఫిల్లింగ్

Advertisement

ఏసీ నుంచి కూలింగ్ రాకపోవడానికి ప్రధాన కారణంగా గ్యాస్ లీక్ గురించి చెబుతారు. దీనిని తిరిగి రీఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ రకాన్ని బట్టి మెకానిక్ డబ్బు వసూలు చేయవచ్చు. పాత మోడల్ ఏసీల్లో R-22 గ్యాస్ ను ఫిల్ చేస్తారు. దీనికోసం రూ.1800-2500 వరకూ ఛార్జ్ చేస్తారు. కొత్త మోడల్ ఏసీలకు R-32 లేదా R-410A గ్యాస్ ను ఉపయోగిస్తారు. దీని కోసం రూ.2,500-3,800 వరకూ ఛార్జ్ చేస్తారు. ఒక వేళ గ్యాస్ ను కొద్దిగా మాత్రమే నింపాల్సి వస్తే.. రూ.1000-1500 లోపు ఇవ్వొచ్చు.

రిపేర్లు, స్పేర్ పార్ట్స్ ఖర్చు

ఏసీలోని ఏదైనా పార్ట్ పాడైతే దానికంటూ సెపరేట్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కెపాసిటర్ కొత్తది వేయాల్సి వస్తే రూ.300-900, ఫ్యాన్ మోటార్ రూ.1500-3000, పీసీబీ రిపేర్ రూ.2000-5000 తీసుకుంటారు. ఒకవేళ ఏకంగా కంప్రెసర్ దెబ్బతింటే భారీ మెుత్తంలో చెల్లించాల్సి రావొచ్చు. కొత్త కంప్రెస్ రూ.5000-12000 వరకూ ఉంటుంది.

Also Read: Automatic Roti Maker: హేయ్, ఇదేదో భలే ఉందే.. అలా పిండి వేస్తే.. ఇలా రోటీలు వచ్చేస్తున్నాయ్!

మోసపోకుండా ఉండేందుకు చిట్కాలు..

ఏసీ మెకానిక్ ను సంప్రదించిన సమయంలోనే విజిటింగ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీల గురించి స్పష్టంగా మాట్లాడితే మంచిది. సాధారణంగా విజిటింగ్ ఫీజు రూ.200 – 300 ఉంటుంది. ఒకవేళ ఏసీలో గ్యాస్ లేదని చెప్పినప్పుడు ప్రెజర్ గేజ్ రీడింగ్ ను చూపించమని అడగండి. మరోవైపు కొందరు ప్రొఫెషనల్స్ లేదా ఏజెన్సీలు.. ఏసీ సర్వీసింగ్ తర్వాత 15-30 రోజుల వారంటీ ఇస్తాయి. వాటిని ఎంచుకుంటే ఏసీ సర్వీసింగ్ తర్వాత వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యగమనిక: ఏసీ సర్వీసింగ్ ఛార్జీలను టెక్ వెబ్ సైట్స్, నిపుణులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ప్రాంతం, నగరం, రాష్ట్రాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. సర్వీసింగ్ చేయించే ముందు ధరలను ప్రొఫెషనల్స్ లేదా ఏజెన్సీలతో మాట్లాడి నిర్ధారించుకుంటే మంచిది.

Also Read: Iran AI Video: ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టాలంటే.. దానిమ్మ జ్యూస్ తాగండి.. ఏఐ వీడియోతో ఇరాన్ సెటైర్లు!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×