E-Paper
Advertisement

Amazon Sale 2026: రూ.15వేల నుంచే 4K స్మార్ట్ టీవీలు.. అమెజాన్‌ సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!

Amazon Sale 2026: రూ.15వేల నుంచే 4K స్మార్ట్ టీవీలు.. అమెజాన్‌ సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!
Advertisement

Amazon Sale 2026: అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 సందర్భంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.15వేల నుండి రూ.30వేల బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న టీవీని కొనాలనుకునే వారికి ఇంతకంటే మంచి సమయం రాదు. ఇప్పటికే ఈ డీల్ స్టార్ట్ అవ్వడంతో నచ్చిన బ్రాండ్ టీవీలను కొనడానికి జనాలు ఎగబడుతున్నారు. ఈ సేల్‌లో శాంం‌సంగ్, షియోమీ, టీసీఎల్ వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలతో తక్కువ ధరకే కొత్త టీవీని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ సేల్‌లో లభిస్తున్న టాప్ టీవీ మోడల్స్ వివరాలు చూద్దాం.

Xiaomi 4K Fire TV  

షియోమీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ 43 ఇంచుల టీవీ బడ్జెట్ ధరలో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఇది 4K రిజల్యూషన్‌తో పాటు హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌ను కలిగి ఉండటం వల్ల సినిమాలు చూసేటప్పుడు కలర్స్ చాలా సహజంగా కనిపిస్తాయి. దీనిలో ఫైర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ వాడటం వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ చాలా వేగంగా పనిచేస్తాయి. దీనిలోని 24 వాట్ల డాల్బీ ఆడియో స్పీకర్లు మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. తక్కువ ధరలో మంచి పనితీరు కావాలనుకునే వారికి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్.

TCL 4K QLED Google TV  

Advertisement

టీసీఎల్ కంపెనీ ఈ మోడల్‌లో QLED టెక్నాలజీని అందించింది. దీంతో సాధారణ ఎల్‌ఈడీ టీవీల కంటే మెరుగైన బ్రైట్‌నెస్, కలర్స్ దీనిలో కనిపిస్తాయి. గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ ఉండటం వల్ల వాయిస్ కమాండ్స్‌తో టీవీని సులభంగా కంట్రోల్ చేయొచ్చు. ఈ టీవీకి మెటాలిక్ బాడీ ఉండటం వల్ల చూడటానికి చాలా ప్రీమియం లుక్‌లో ఉంటుంది. స్పోర్ట్స్ లేదా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ టీవీలో ఉండే ఎంఈఎంసీ ఫీచర్ బాగా నచ్చుతుంది.

Also Read: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!

VW Pro QLED TV 

Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి వీడబ్ల్యూ ప్రో సిరీస్ టీవీ బెటర్ ఆప్షన్. దీనిలో కూడా 4K రిజల్యూషన్, క్యూలెడ్ ప్యానెల్ వాడారు. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ వల్ల ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి అనుభూతి కలుగుతుంది. దీని బెజెల్ లెస్ డిజైన్ టీవీ స్క్రీన్‌ను పెద్దదిగా చూపిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సాయంతో మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్‌ను వాయిస్ కంట్రోల్ ద్వారా వెతకొచ్చు.

Samsung FHD Smart TV

ఈ శాంసంగ్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో వాడిన కలర్ టెక్నాలజీ వల్ల విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. శాంసంగ్ సొంత టైజెన్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ ఈ టీవీలో ఉంది. మొబైల్‌లోని కంటెంట్‌ను టీవీలోకి మిర్రరింగ్ చేయడం దీనిలో చాలా ఈజీ. నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అనుకునే వారికి ఈ టీవీ సరిపోతుంది.

Hisense E-Series QLED 

హైసెన్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ 30 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లతో వస్తుంది. సాధారణంగా బడ్జెట్ టీవీలలో సౌండ్ తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల వినడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ మీద నడుస్తుంది. 1080p రిజల్యూషన్ ఉన్నప్పటికీ, ఈ టీవీలో క్యూలెడ్ ప్యానెల్ వల్ల విజువల్స్ చాలా క్లారిటీగా వస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఆడియో, వీడియో కావాలనుకునే వాళ్లు ఈ టీవిని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ సేల్‌లో మరింత తగ్గింపు పొందవచ్చు. మరెందుకు ఆలస్యం మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని ఈ సేల్ ముగిసేలోపు ఆర్డర్ చేసుకోండి.

Also Read: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఐఫోన్లలో ఒకటి ‘మేడ్ ఇన్ ఇండియా’.. మార్కెట్లో 25% వాటా మనదే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×