E-Paper
Advertisement

డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్!

డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్!
Advertisement

Best dishwasher in India 2026: ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ పని, ఇంటి పని రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మహిళలకు, వర్కింగ్ ఉమెన్స్‌కు పెద్ద టాస్క్ గా మారింది. అందులోనూ వంట చేసిన తర్వాత గిన్నెలు కడగడం అంటే అదో పెద్ద యుద్ధం. పైగా మన ఇండియన్ వంటల్లో ఆయిల్, మసాలాలు ఎక్కువ కాబట్టి జిడ్డు వదలడం అంత ఈజీ కాదు. ఇలాంటి టైమ్‌లో టైమ్ సేవ్ చేస్తూ.. చేతులకు శ్రమ లేకుండా చేసే అద్భుతమైన గ్యాడ్జెట్ “డిష్‌వాషర్”. ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టాప్ డిష్‌వాషర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ డిష్‌వాషర్లు (Best Dishwashers in India):

చాలా మందికి డిష్‌వాషర్ల పై ఒక అపోహ ఉంది “ఇవి మన ఇండియన్ గిన్నెలను సరిగ్గా కడగలేవు” అని. కానీ ప్రస్తుత మోడరన్ డిష్‌వాషర్లు ప్రత్యేకంగా ఇండియన్ కిచెన్ అవసరాలకు, ఇక్కడి మొండి జిడ్డు, కడిగి ఎండిపోయిన అన్నం గిన్నెలను కూడా క్లీన్ చేసేలా డిజైన్ చేయబడ్డాయి. యూజర్ రివ్యూల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న టాప్ ఆప్షన్స్ ఇవే..

Advertisement

1. బాష్ 13 ప్లేస్ సెట్టింగ్ డిష్‌వాషర్ (Bosch 13 Place Settings):

డిష్‌వాషర్ అనగానే అందరికీ గుర్తొచ్చే నమ్మకమైన బ్రాండ్ ‘బాష్’. ఇండియన్ వంట పాత్రలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Advertisement

ప్రత్యేకత:ఇందులో ‘ఇంటెన్సివ్ కడాయి 70°C’ అనే స్పెషల్ ఫీచర్ ఉంది. ఇది ఎక్కువ వేడి నీటితో కడగడం వల్ల ఎంతటి మొండి జిడ్డు, మసాలా మరకలైనా ఈజీగా వదిలిపోతాయి.

లాభం: ఇది గిన్నెలను క్లీన్ చేయడమే కాకుండా 99.9% బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. మీడియం సైజ్ ఫ్యామిలీకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్.

2. ఎల్‌జీ 14 ప్లేస్ సెట్టింగ్ వై-ఫై డిష్‌వాషర్ (LG 14 Place Settings):

టెక్నాలజీ పరంగా ఎల్‌జీ ఎప్పుడూ ముందే ఉంటుంది. పెద్ద కుటుంబాల కోసం ఈ 14 ప్లేస్ సెట్టింగ్ మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రత్యేకత: ఇందులో ‘ట్రూ స్టీమ్’ టెక్నాలజీ ఉంది. అంటే వేడి నీటి ఆవిరితో గిన్నెలను క్లీన్ చేస్తుంది. దీనివల్ల గిన్నెలపై నీటి మచ్చలు పడవు, గాజు గిన్నెలు కూడా మెరిసిపోతాయి.

లాభం: దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌కు (ThinQ App) కనెక్ట్ చేసి వై-ఫై ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ వల్ల శబ్దం అస్సలు రాదు.

3. ఐఎఫ్‌బీ 15 ప్లేస్ సెట్టింగ్ డిష్‌వాషర్ (IFB 15 Place Settings):

ఎక్కువ గిన్నెలు పట్టేలా, పెద్ద స్పేస్ కావాలనుకునే వారికి ఐఎఫ్‌బీ బెస్ట్ ఆప్షన్.

ప్రత్యేకత: ఇందులో ‘హాట్ వాటర్ వాష్’, త్రీ-స్ప్రే ఆర్మ్స్ ఉంటాయి. ఇవి మెషీన్ లోపల అన్ని మూలలకూ నీటిని స్ప్రే చేసి గిన్నెలను శుభ్రం చేస్తాయి.

లాభం: హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగా పనిచేసేలా ‘వాటర్ సాఫ్ట్ నర్’ టెక్నాలజీని ఇందులో ఇచ్చారు.

4. గోద్రెజ్ ఈయాన్ డిష్‌వాషర్ (Godrej Eon Dishwasher):

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఆశించే వారికి మన ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ ఒక మంచి ఆప్షన్.

ప్రత్యేకత: ఇది చిన్న, మీడియం ఫ్యామిలీలకు సరిపోతుంది. ఇందులో ‘యాంటీ-బ్యాక్టీరియల్’ ఫిల్టర్ ఉంటుంది.

లాభం: ఇది తక్కువ కరెంట్, తక్కువ నీటిని వాడుకుంటూ ఎకో-ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ డిష్‌వాషర్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

Also Read: టైమ్ లేదు బాబోయ్ అనే వాళ్లకు గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్ కుక్కర్ ఉంటే వంట నిమిషాల్లోనే

డిష్‌వాషర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
1,ప్లేస్ సెట్టింగ్: మీ ఇంట్లో 3-4 గురు ఉంటే 13 ప్లేస్ సెట్టింగ్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మంది ఉంటే 14 లేదా 15 ప్లేస్ సెట్టింగ్ వైపు వెళ్ళండి.

2.కరెంట్,నీటి వాడకం: చేత్తో కడిగితే నీరు ఎక్కువగా వృథా అవుతుంది. కానీ డిష్‌వాషర్లు కేవలం 9 నుంచి 12 లీటర్ల నీటితోనే మొత్తం గిన్నెలను అద్భుతంగా కడుగుతాయి.

3.పాత్రల రకాలు: స్టీల్, గాజు, పింగాణీ, డిష్‌వాషర్ సేఫ్ అని ఉన్న ప్లాస్టిక్ పాత్రలను ఇందులో ఈజీగా కడగవచ్చు. అయితే స్వచ్ఛమైన రాగి , ఇత్తడి, అల్యూమినియం పాత్రలను ఇందులో పెట్టకపోవడమే మంచిది.

డిష్‌వాషర్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు.. ప్రతి ఇంటికీ ఒక అవసరం. మీ బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు లాంగ్ లైఫ్, బెస్ట్ క్లీనింగ్ కావాలనుకుంటే బాష్ లేదా ఎల్‌జీ కి వెళ్ళిపోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో కావాలంటే.. గోద్రెజ్ బెస్ట్ ఛాయిస్. ఈ డిజిటల్ యుగంలో మీ వంటగదిని కూడా స్మార్ట్‌గా మార్చేసి.. అమూల్యమైన సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయించండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×