E-Paper
Advertisement

Digital Weighing Machine: రూ.1000లోపే అదిరిపోయే డిజిటల్ వెయింగ్ మెషీన్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!

Digital Weighing Machine: రూ.1000లోపే అదిరిపోయే డిజిటల్ వెయింగ్ మెషీన్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!
Advertisement

Best Digital Weighing Machine: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చాలా ముఖ్యం. బరువు పెరగడం లేదా తగ్గడం అనే ప్రక్రియలో మన శరీర బరువును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం అత్యవసరం. దీని కోసం పాత కాలపు అనలాగ్ మెషీన్ల కంటే ఎల్సీడీ డిస్‌ప్లే ఉన్న డిజిటల్ వెయింగ్ మెషీన్లు బెటర్. ఇవి కేవలం బరువును మాత్రమే కాకుండా..ఖచ్చితమైన ఇతర రీడింగ్స్‌ సెకన్లలో అందిస్తాయి. మార్కెట్లో వందల మోడల్స్ ఉన్నప్పటికీ.. కస్టమర్ల నమ్మకాన్ని పొందిన టాప్ 3 బెస్ట్ మెషీన్ల వివరాలు మీకోసం.

ఇంట్లోనే బరువు చూసుకోండి.. టాప్ 3 డిజిటల్ వెయింగ్ మెషీన్ల పూర్తి వివరాలు:
బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నవారికి ఇంట్లో ఒక వెయింగ్ మెషీన్ ఉండటం ఎంతో అవసరం.అయితే ఏ మెషీన్ పడితే అది కొనకుండా.. మంచి నాణ్యత , ఖచ్చితత్వం ఉన్నవాటిని ఎంచుకోవాలి. మన దేశంలో ప్రస్తుతం బాగా అమ్ముడవుతున్న మూడు బెస్ట్ డిజిటల్ వెయింగ్ మెషీన్లు ఇవే..

Advertisement

1. HealthSense Ultra-Lite PS 126:
బడ్జెట్ ధరలో మంచి నాణ్యతను కోరుకునే వారికి ఇది మొదటి ఛాయిస్. దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. చాలా తక్కువ బరువు ఉంటుంది.

ప్రత్యేకతలు: ఇందులో ‘G-Sensors’ టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది బరువును చాలా ఖచ్చితంగా చూపిస్తుంది. పెద్దగా ఉండే LCD స్క్రీన్ వల్ల చీకటిలో కూడా అంకెలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ABS ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. కాబట్టి గాజు మెషీన్లలాగా పగిలిపోతుందనే భయం ఉండదు.

Advertisement

ధర:సుమారు రూ. 900 నుంచి రూ.1,200 మధ్య లభిస్తుంది.

2. Dr Trust (USA) Personal Digital Weighing Scale:
మీకు ప్రీమియం లుక్, ఎక్కువ ఫీచర్లు కావాలంటే డాక్టర్ ట్రస్ట్ మెషీన్ బెస్ట్. ఇది చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది.

ప్రత్యేకతలు: దీనికి ‘Accu-Gauge’ సెన్సార్లు ఉన్నాయి. ఇది గది ఉష్ణోగ్రతను కూడా స్క్రీన్ మీద చూపిస్తుంది. దీని LCD డిస్‌ప్లే నీలి రంగు బ్యాక్‌లైట్‌తో వస్తుంది. ఇది గట్టి టెంపర్డ్ గ్లాస్‌తో తయారైంది. అంతే కాకుండా 180 కిలోల వరకు బరువును ఇది తట్టుకోగలదు.

ధర: ఇది సుమారు రూ. 1,000 నుంచి రూ. 1,500 మధ్య అందుబాటులో ఉంటుంది.

3. Omron HN 289 Digital Weight Scale:
‘ఓమ్రాన్’ ఒక నమ్మకమైన బ్రాండ్. దీని డిజిటల్ స్కేల్ చాలా బాగుంటుంది.

ప్రత్యేకతలు: ఇందులో ఆటో ఆన్/ఆఫ్ ఫీచర్ ఉంది. అంటే మీరు మెషీన్ పైకి ఎక్కగానే అది రీడింగ్ చూపిస్తుంది. దిగిపోగానే ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చాలా కాలం వస్తుంది. 4-సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రతిసారీ సరైన రీడింగ్‌ను ఇస్తుంది.

ధర: సుమారు రూ. 1,200 నుంచి రూ. 1,600 మధ్య దొరుకుతుంది.

Also Read: ఈ క్యూట్ డిష్‌వాషర్ ఉంటే.. పనిమనిషితో అవసరమే ఉండదు!

డిజిటల్ వెయింగ్ మెషీన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఫ్లాట్ సర్ఫేస్: మెషీన్‌ను ఎప్పుడూ సమానంగా ఉన్న నేలపై ఉంచాలి. కార్పెట్స్ లేదా మ్యాట్స్ మీద ఉంచితే రీడింగ్ తప్పుగా వస్తుంది.

ఒకే సమయం: ప్రతి రోజూ ఉదయం పరగడుపున బరువు చూసుకోవడం వల్ల శరీరంలోని మార్పులను గమనించవచ్చు.

కదలకుండా నిలబడటం: మెషీన్ పై ఎక్కిన తర్వాత రీడింగ్ స్థిరంగా వచ్చే వరకు కదలకుండా నిలబడాలి.

మీరు తక్కువ ధరలో స్ట్రాంగ్‌గా ఉండే మెషీన్ కావాలనుకుంటే HealthSense ఎంచుకోండి. స్టైలిష్ లుక్ , టెంపరేచర్ కూడా కావాలంటే Dr Trust బాగుంటుంది. లేదు.. మాకు బ్రాండ్ వాల్యూ , లాంగ్ లైఫ్ ముఖ్యమనుకుంటే Omron పర్ఫెక్ట్ ఛాయిస్. మీ బడ్జెట్ , అవసరానికి తగినట్లుగా వీటిలో ఒకటి ఎంచుకుని మీ ఫిట్‌నెస్ జర్నీని ఈరోజే మొదలుపెట్టండి.

Related News

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×