E-Paper
Advertisement

ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్‌తో వచ్చే ఇన్వర్టర్ ఏసీలు.. టాప్ బ్రాండ్స్ ఇవే

ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్‌తో వచ్చే ఇన్వర్టర్ ఏసీలు.. టాప్ బ్రాండ్స్ ఇవే
Advertisement

Advanced Air Purification Inverter AC: ఎండలు ముదిరిపోతుంటే ఏసీ ఆన్ చేయకుండా అస్సలు ఉండలేం. కానీ, బయట పెరిగిపోతున్న పొల్యూషన్ మన ఇంట్లోకి కూడా చేరిపోతోంది. అందుకే.. ఇప్పుడు ఏసీ అంటే కేవలం రూమ్ చల్లబరిచేది మాత్రమే కాదు.. మన శ్వాసకు స్వచ్ఛమైన గాలిని ఇచ్చేది కూడా అయిండాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లోకి ‘అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫికేషన్’ టెక్నాలజీతో సూపర్ ఇన్వర్టర్ ఏసీలు వచ్చేశాయి. ఇవి రూమ్‌ను కూల్ చేస్తూనే ఎయిర్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తాయి. ఆ లేటెస్ట్ మోడల్స్ ఏంటో ఓసారి చూసేద్దామా!

ఏసీల్లో ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎందుకు మస్ట్?
మన కంటికి కనిపించని దుమ్ము, ధూళి కణాలు (PM 2.5), వైరస్‌లు గదిలో తిరుగుతూనే ఉంటాయి. మామూలు ఏసీలు వీటిని ఏమీ చేయలేవు. కానీ ఇన్వర్టర్ ఏసీల్లో వస్తున్న కొత్త ఫిల్టర్లు గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను 99.9% వరకు క్లీన్ చేసేస్తాయి. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉంటే ఇలాంటి ఏసీలు ఒక బెస్ట్ ఛాయిస్.

Advertisement

టాప్ ఇన్వర్టర్ ఏసీ మోడల్స్:
డైకిన్ 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీ (Daikin Streamer Discharge): డైకిన్ వాళ్ల ‘స్ట్రీమర్ డిశ్చార్జ్’ టెక్నాలజీ గదిలోని వైరస్‌లను, బ్యాక్టీరియాలను ఎలక్ట్రాన్ల సాయంతో ముక్కలు ముక్కలుగా విరిచేస్తుంది. దుమ్మును అస్సలు రానివ్వదు.

ఎల్‌జీ ఏఐ కన్వర్టబుల్ 6-ఇన్-1 ఏసీ (LG Plasmaster Ionizer+): ఇది మిలియన్ల కొద్దీ అయాన్లను గాలిలోకి వదిలి బ్యాక్టీరియాతో పాటు రూమ్‌లో వచ్చే చెడు వాసనలను కూడా మాయం చేస్తుంది.

Advertisement

పానాసోనిక్ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ (Panasonic nanoe-X): గాల్లోని తేమతోనే హైడ్రాక్సిల్ రాడికల్స్‌ను తయారు చేసి, సోఫాలు, కర్టెన్లకు పట్టిన వైరస్‌లను కూడా క్లీన్ చేస్తుంది. దీనికి వై-ఫై సపోర్ట్ కూడా ఉంది.

లాభాలు ఏంటంటే?
ఇన్వర్టర్ ఏసీల వల్ల కరెంట్ బిల్లు దాదాపు 30% నుంచి 40% వరకు తక్కువ వస్తుంది. పైగా ఇవి అస్సలు శబ్దం చేయవు, రాత్రిపూట హ్యాపీగా పడుకోవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×