E-Paper
Advertisement

చిన్న కిచెన్ కోసం అదిరిపోయే.. 5 స్పేస్-సేవింగ్ చిమ్నీలు ఇవే!

చిన్న కిచెన్ కోసం అదిరిపోయే.. 5 స్పేస్-సేవింగ్ చిమ్నీలు ఇవే!
Advertisement

Best Chimney for Small Kitchen: ఈ రోజుల్లో నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. దాంతో వంటగది కూడా చాలా ఇరుకైపోతోంది. చిన్న కిచెన్ ఉన్నప్పుడు వంట చేసేటప్పుడు వచ్చే పొగ, జిడ్డు ఇల్లంతా వ్యాపించి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే తక్కువ స్థలంలో అమరిపోయే “స్పేస్-సేవింగ్ చిమ్నీలు” ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిన్న కిచెన్ రూమ్‌ల కోసం తక్కువ స్థలాన్ని ఆక్రమించే, బడ్జెట్ ధరలో లభించే 5 బెస్ట్ కిచెన్ చిమ్నీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న కిచెన్ కోసం 5 బెస్ట్ స్పేస్-సేవింగ్ చిమ్నీలు:

1. ఫేబర్ 60 సెం.మీ ఫిల్టర్‌లెస్ చిమ్నీ (Faber 60 cm 1200 m³/hr Filterless Chimney):

చిన్న కిచెన్ ఉన్నవారికి ఫేబర్ బ్రాండ్ బెస్ట్ చెప్పాలి. దీని కాంపాక్ట్ డిజైన్ గోడకు అస్సలు బరువుగా అనిపించదు.

Advertisement

ఫీచర్లు: ఇది ఫిల్టర్‌లెస్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మోషన్ సెన్సార్ (చెయ్యి ఊపితే ఆన్ అవుతుంది) ఫీచర్ కూడా ఉంది.
ధర: రూ13,000 లోపు లభిస్తుంది.

2. ఎలికా 60 సెం.మీ ఆటో-క్లీన్ చిమ్నీ (Elica 60 cm 1200 m3/hr Auto Clean):

Advertisement

ఎలికా చిమ్నీలు వాటి స్లీక్ లుక్స్, తక్కువ స్థలాన్ని ఆక్రమించే డిజైన్‌కు చాలా ఫేమస్.

ఫీచర్లు: దీనిలో థర్మల్ ఆటో-క్లీన్ ఫీచర్ ఉంది. అంటే ఒక బటన్ నొక్కితే చిమ్నీ లోపల ఉన్న జిడ్డు అంతా కరిగి ఒక ఆయిల్ కలెక్టర్‌లోకి వచ్చేస్తుంది. చిన్న కిచెన్ లో మెయింటెనెన్స్ తగ్గించుకోవడానికి ఇది బెస్ట్.

ధర: రూ.14,000 వరకు ఉంటుంది.

3. హిండ్‌వేర్ స్మార్ట్ అప్లయన్స్ నాడియా (Hindware Smart Appliances Nadia 60 cm):

పొగను పీల్చడంలో ఇది చాలా పవర్‌ఫుల్. సైజు చిన్నదైనా దీని పనితనం చాలా పెద్దది.

ఫీచర్లు: 1350 m³/hr సక్షన్ పవర్‌తో వస్తుంది. అంటే మీ కిచెన్ చిన్నదైనా సరే, ఎంత ఎక్కువ ఫ్రైలు చేసినా సరే క్షణాల్లో పొగను బయటకు పంపేస్తుంది. దీని లుక్ కూడా చాలా మోడ్రన్‌గా ఉంటుంది.

ధర: రూ.15,000 లోపు దొరుకుతుంది.

4. గ్లెన్ 60 సెం.మీ కర్వ్డ్ గ్లాస్ చిమ్నీ (Glen 60 cm 1050 m3/hr Curved Glass):

మీ కిచెన్ చాలా చిన్నది, అలాగే మీ బడ్జెట్ కూడా తక్కువగా ఉంటే గ్లెన్ చిమ్నీ మంచి ఛాయిస్.

ఫీచర్లు: ఇది కర్వ్డ్ గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. వంటగదికి లగ్జరీ లుక్ ఇస్తుంది. దీనిలో ఉండే పుష్ బటన్ కంట్రోల్స్ వాడుకకు చాలా ఈజీగా ఉంటాయి.

ధర:రూ. 9,000 లోపే లభిస్తుంది.

5. ఇన్లాసా 60 సెం.మీ పిరమిడ్ చిమ్నీ (Inalsa 60 cm 1150 m³/hr Pyramid Chimney):

పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ చిమ్నీలు తక్కువ వెడల్పు ఉన్న కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లకు పక్కాగా సూట్ అవుతాయి.

Also Read: క్విక్ వాష్’వాడుతున్నారా ? ఇలా ఉతికితే బట్టలు గోవిందా..!

ఫీచర్లు: దీనిలో స్టెయిన్‌లెస్ స్టీల్ బాఫిల్ ఫీల్టర్లు ఉంటాయి. ఇవి ఇండియన్ వంటల్లో వాడే మసాలాలు, నూనె జిడ్డును బాగా గుంజేస్తాయి.

ధర: రూ. 8,000 కే లభిస్తుంది.

చిన్న వంటగదికి చిమ్నీ కొనేటప్పుడు ఎప్పుడూ 60 సెం.మీ సైజును, అలాగే ఆటో-క్లీన్ లేదా ఫిల్టర్‌లెస్ టెక్నాలజీ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది. దీని వల్ల స్థలం కలిసిరావడమే కాకుండా వంటగది ఎప్పుడూ నీట్‌గా, సువాసనతో ఉంటుంది. మీ బడ్జెట్ , కిచెన్ లుక్‌ని బట్టి పైన పేర్కొన్న 5 మోడల్స్ లో ఏదో ఒకటి ఈరోజే సెలెక్ట్ చేసుకోండి.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×