E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ నెక్‌బ్యాండ్ కావాలా? అమెజాన్‌లో ఈ మోడల్స్ అస్సలు మిస్ అవ్వకండి

బడ్జెట్ ధరలో బెస్ట్ నెక్‌బ్యాండ్ కావాలా? అమెజాన్‌లో ఈ మోడల్స్ అస్సలు మిస్ అవ్వకండి
Advertisement

Best Neckband Earphones Amazon: వైర్ల గందరగోళం లేకుండా, రోజంతా మెడలో వేసుకున్నా భారంగా అనిపించని ఇయర్‌ఫోన్స్ అంటే నెక్‌బ్యాండ్స్ మాత్రమే. ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీసు పనిలో ఉన్నా లేదా వర్కౌట్స్ చేస్తున్నా ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అమెజాన్‌లో ప్రస్తుతం వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో బెస్ట్ సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్ , తక్కువ ధరలో లభించే టాప్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

అమెజాన్‌లో టాప్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ 2026:

ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ, ఇయర్‌ఫోన్స్‌లో కూడా అద్భుతమైన ఫీచర్లు వస్తున్నాయి. ముఖ్యంగా 2026.. ఏప్రిల్ నాటికి అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న కొన్ని టాప్ నెక్‌బ్యాండ్స్ గురించి ముఖ్యమైన వివరాలు..

Advertisement

1. OnePlus Bullets Wireless Z3 (ఒన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z3):(Rs.1,799)
ఒన్‌ప్లస్ బ్రాండ్ నెక్‌బ్యాండ్ కేటగిరీలో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. తాజా వెర్షన్ Z3 అద్భుతమైన 12.4mm డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది.

బ్యాటరీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తుంది.

Advertisement

ఫీచర్స్: కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 20 గంటలు మ్యూజిక్ వినొచ్చు. దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా ఉంది.

2. Realme Buds Wireless 5 ANC (రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5):(Rs.1,549)
తక్కువ ధరలో ‘ప్రీమియం’ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

నాయిస్ క్యాన్సిలేషన్: ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇది బయటి శబ్దాలను దాదాపుగా తగ్గించేస్తుంది.

గేమింగ్: గేమర్స్ కోసం ఇందులో 45ms లో లేటెన్సీ మోడ్ ఉంది.దీని వల్ల గేమ్ ఆడుతున్నప్పుడు ఆడియో డిలే ఉండదు.

3. BoAt Rockerz 255 Pro+ (బోట్ రాకర్జ్ 255 ప్రో ప్లస్):(RS.1,099)
మీరు బడ్జెట్ యూజర్ అయితే.. బోట్ మోడల్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది.

సౌండ్: బోట్ సిగ్నేచర్ సౌండ్ (Extra Bass) మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తుంది.

రెసిస్టెన్స్: IPX7 రేటింగ్‌తో వస్తుంది కాబట్టి చెమట లేదా చిన్నపాటి వర్షానికి ఇవి పాడవవు. జిమ్‌కి వెళ్లేవారికి ఇది పర్ఫెక్ట్.

4. Sony WI-C100 (సోనీ WI-C100):(RS.1,599)
క్లాసిక్ మ్యూజిక్ , క్లారిటీ ఇష్టపడే వారు సోనీని ఎంచుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 25 గంటల వరకు ఉంటుంది. దీనికి ‘Sony Headphones Connect’ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు మీకు నచ్చినట్లు ఈక్వలైజర్‌ని సెట్ చేసుకోవచ్చు.

Also Read: ఏసీ లైఫ్ పెరగాలంటే సరైన స్టెబిలైజర్ ఉండాల్సిందే! కంప్రెసర్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

5. CMF by Nothing Neckband Pro (సీఎమ్ఎఫ్ బై నథింగ్):(RS.1,799 )
నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ నెక్‌బ్యాండ్ డిజైన్ పరంగా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక రోలర్ బటన్ ఉంటుంది. దానితో వాల్యూమ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇది 13.6mm డ్రైవర్లతో భారీ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

నెక్‌బ్యాండ్ కొనేటప్పుడు ఏం గమనించాలి?
బ్యాటరీ లైఫ్: కనీసం 20-30 గంటల బ్యాటరీ ఉండేలా చూసుకోండి.

ఫాస్ట్ ఛార్జింగ్: తక్కువ సమయంలో ఎక్కువ ప్లేబ్యాక్ ఇచ్చే ఫీచర్ ముఖ్యం.

ANC: మీరు ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తే.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న మోడల్ తీసుకోండి.

వాటర్ రెసిస్టెన్స్: వర్కౌట్స్ చేసే అలవాటు ఉంటే.. IPX5 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉండాలి.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×