E-Paper
Advertisement

ఏసీని ఎలా పడితే అలా ఆఫ్ చేస్తున్నారా? అయితే షెడ్డుకు వెళ్లడం ఖాయం!

ఏసీని ఎలా పడితే అలా ఆఫ్ చేస్తున్నారా? అయితే షెడ్డుకు వెళ్లడం ఖాయం!
Advertisement

AC Shutdown Tips: ఎండలు మండిపోతున్న వేళ ఏసీలు కొండంత ఉపశమనాన్ని అందిస్తున్నాయి. అయితే చాలామంది.. ఏసీని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఒక సాధారణ విషయంగా భావిస్తుంటారు. కానీ ఏసీని షట్‌డౌన్ చేసేటప్పుడు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. లాంగ్ రన్‌లో ఏసీని పూర్తిగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మెయిన్ స్విచ్ ఆఫ్

చాలామంది రిమోట్‌తో ఏసీని ఆఫ్ చేయకుండా నేరుగా గోడకున్న మెయిన్ పవర్ స్విచ్‌ను కట్టేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఏసీ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కంప్రెసర్ యాక్టివ్‌గా ఉంటుంది. హఠాత్తుగా పవర్ కట్ చేయడం వల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడు ఏసీని రిమోట్‌తో ఆఫ్ చేసి ఆ తర్వాతే మెయిన్ స్విచ్ కట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెంటవెంటనే ఆన్, ఆఫ్ చేయడం

Advertisement

గది కాస్త చల్లబడగానే ఏసీ ఆఫ్ చేయడం, మళ్లీ ఐదు నిమిషాలకే ఆన్ చేయడం లాంటివి కొందరు చేస్తుంటారు. ఇలా పదే పదే చేయడం వల్ల కంప్రెసర్ సైకిల్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా కంప్రెసర్ మోటార్ కాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఫ్యాన్ మోడ్ లైట్ తీసుకోవడం

కొందరు గంటల తరబడి ఏసీని వాడిన తర్వాత నేరుగా ఆఫ్ చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని ఎక్కువ సేపు రన్నింగ్ లో ఉంచినప్పుడు కాయిల్స్ లోపల తేమ పేరుకుపోతుంది. కాబట్టి ఏసీని ఆఫ్ చేసే ముందు ఒక 10 నిమిషాల పాటు కేవలం ‘ఫ్యాన్ మోడ్’ (Fan Mode)లో ఉంచితే.. లోపల ఉన్న తేమ ఆరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే బూజు, ఫంగస్ చేరి బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా కాయిల్స్ పాడైపోతాయని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: జస్ట్ రూ.1,799కే Itel Aqua వాటర్ ప్రూఫ్ ఫోన్.. అరగంట నీటిలో ఉన్నా ఏం కాదు!

వాడనప్పుడు ప్లగ్ వదిలేయడం

చాలామంది వర్షాకాలం, శీతాకాలంలో నెలల తరబడి ఏసీని వాడకుండా పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఏసీ ప్లగ్ ను ఫ్లగ్ కు కనెక్ట్ చేసి అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులు  జరిగినప్పుడు ఏసీలోని సర్క్యూట్ బోర్డ్ కాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెుత్తంగా ఏసీని ఆఫ్ చేసే ముందు బ్లోయర్ లేదా ఫ్యాన్ మోడ్ ఆన్ చేయడం అలవాటు చేసుకుంటే ఏసీ మన్నిక పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఇక యాక్సిడెంట్లకు చెక్.. రూ. 15 లక్షల లోపు ADAS కార్లు వచ్చేశాయి!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×