E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Flipkart Summer Sale: మోటరోలా, ఒప్పో ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ఎంత ధర తగ్గిందంటే?

Flipkart Summer Sale: మోటరోలా, ఒప్పో ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ఎంత ధర తగ్గిందంటే?
Advertisement

Flipkart Summer Sale: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఈ సమ్మర్‌లో చల్లని కబురు చెప్పింది ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్. మే 9వ తేదీ నుంచి Flipkart Summer Sale షురూ కానుంది. అమెజాన్ సేల్‌కు పోటీగా వస్తున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. సేల్ మొదలవ్వడానికి ముందే కొన్ని స్పెషల్ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ బయటపెట్టింది. మీరు కూడా కొత్త ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఆ వివరాలు మీ కోసం!

మోటరోలా ఫోన్లపై క్రేజీ ఆఫర్లు..

ఈ సేల్‌లో Motorola Edge 70 Fusionపై రూ.2వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో రూ.26,999 ఉండే ఈ ఫోన్ సేల్‌లో రూ.24,999కే దొరుకుతుంది. దీంతో పాటు Motorola Edge 60 Pro, తక్కువ బడ్జెట్‌లో ఉండే Moto G06 Power వంటి మోడల్స్ కూడా మునుపటి కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

అన్ని బ్రాండ్ల పైనా డిస్కౌంట్లు..

Advertisement

కేవలం మోటరోలానే కాదు.. రియల్‌మీ, ఒప్పో, పోకో, శాంసంగ్ లాంటి బ్రాండ్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. రియల్‌మీలో కొత్తగా వచ్చిన P సిరీస్, GT మోడల్స్ పైన రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక Oppo K14 5G ఫోన్ అయితే ఏకంగా రూ.2,000 తగ్గి రూ.17,999కే లభించనుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి పోకో, ఇన్ఫినిక్స్ ఫోన్లు కూడా బెస్ట్ ఆప్షన్లు.

బ్యాంకు కార్డులతో ఇంకా తక్కువకే..

ఫోన్ ధర తగ్గడమే కాకుండా.. కార్డు ఆఫర్లు కూడా తోడైతే సేవింగ్స్ ఇంకా పెరుగుతాయి. SBI క్రెడిట్ కార్డు వాడేవారికి 10% వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉన్నవారికైతే 5% క్యాష్‌బ్యాక్ గ్యారెంటీ. ఈ ఆఫర్లు EMI మీద కొన్నా వర్తిస్తాయి కాబట్టి.. పెద్దగా ఆర్థిర భారం పడకుండానే మీకు నచ్చిన ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: అమెజాన్‌లో కనీవినీ ఎరుగని సూపర్ సేల్.. Galaxy S25 Ultraపై ఏకంగా రూ.35,000 ధర తగ్గింపు!

ప్లస్ మెంబర్లకు ముందే పండగ..

సాధారణంగా అందరికీ మే 9న సేల్ మొదలవుతుంది కానీ, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఒక రోజు ముందే అంటే.. మే 8 నుండే ఈ డీల్స్ అందుబాటులోకి వస్తాయి. అందరికంటే ముందుగా తక్కువ ధరలో ఫోన్లు దక్కించుకోవాలంటే ఇది మంచి ఛాన్స్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కంపెనీ చెప్పే ఈ సేల్ ప్రైస్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా కలిపి ఉండొచ్చు.

కొనేముందు గమనించాల్సినవి..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని గట్టిగా ఫిక్స్ అయితే.. సేల్ మొదలవ్వకముందే మీకు నచ్చిన మోడల్‌ను విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే.. మంచి డిమాండ్ ఉన్న ఫోన్లు స్టాక్ త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంది. అదనపు డిస్కౌంట్ల కోసం పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే ఆప్షన్‌ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సమ్మర్ సేల్‌ను వాడుకుని తక్కువ ధరకే లేటెస్ట్ గ్యాడ్జెట్‌లను ఇంటికి తెచ్చుకోవచ్చు.

Also Read: రూ.100 లోపే అదిరిపోయే డేటా ప్లాన్స్.. Jio, Airtel, Vi, BSNL ఏదైనా సరే.. యూజర్లకు పండగే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ 5 సంకేతాలు ఉంటే.. ప్రమాదంలో పడ్డట్లే!

చీకటిలోనూ పగలు తీసినంత క్లారిటీగా ఫొటోలు.. మ్యాజికల్ ‘బబుల్’ ఫీచర్‌తో వస్తోన్న OPPO Reno 16!

భారత్‌లో యాపిల్ ప్రొడక్ట్‌ల ధరలు భారీగా పెంపు.. ఏ గ్యాడ్జెట్ ధర ఎంత పెరిగిందంటే?

షావోమి మరో అద్భుతం.. దుమ్మురేపే స్మార్ట్ కుక్కర్ లాంచ్.. ఇక బుల్లెట్ స్పీడ్‌తో వంట!

నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు సరే.. ఈ 7 సీక్రెట్స్ గురించి తెలుసా? లేదంటే చాలా మిస్ అవుతున్నట్లే!

జర్మనీలో చాలా ఇళ్లలో ఏసీలు ఉండవు? అసలు కారణం ఇదే!

ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!

ఇల్లు మెరవాలా? ఈ మల్టీ-సర్ఫేస్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీనింగ్ చిటికెలో!

Big Stories

×