E-Paper
Advertisement

కొత్త ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? రూ. 24 వేల లోపు బెస్ట్ గోద్రెజ్ మోడల్ ఇదే!

కొత్త ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? రూ. 24 వేల లోపు బెస్ట్ గోద్రెజ్ మోడల్ ఇదే!
Advertisement

Godrej 244L Double Door Fridge: సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఇంట్లో అందరికీ గుర్తుకు వచ్చేది చల్లని నీరు, తాజాగా ఉండే కూరగాయలు. అందుకే సామాన్యుడి బ్రాండ్‌గా పేరున్న గోద్రెజ్, తన ‘ఈయాన్’ సిరీస్‌లో 244 L Frost Free Double Door మోడల్‌ను లాంచ్ చేసింది. 3-స్టార్ రేటింగ్, మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ , స్టైలిష్ ఫాసిల్ స్టీల్ కలర్‌తో వస్తున్న ఈ ఫ్రిజ్, మిడిల్ క్లాస్ అవసరాలకు పర్ఫెక్ట్ గా సరి పోతుంది. దీని ధర, ముఖ్యమైన ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గోద్రెజ్ 244 L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్- పూర్తి వివరాలు

ప్రస్తుతం దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్ ఉంటుంది. అయితే కేవలం కూలింగ్ మాత్రమే కాకుండా.. కరెంటు ఆదా చేయడం , ఎక్కువ కాలం పాడవకుండా ఉండటం కూడా ముఖ్యమే. ఈ విషయంలో Godrej RF EON 244C 35 RCIF మోడల్ మార్కెట్లో బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది.

Advertisement

డిజైన్ , కెపాసిటీ:
ఈ ఫ్రిజ్ 244 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఇది 3 నుంచి 5 మంది సభ్యులున్న కుటుంబానికి చాలా బాగా సరిపోతుంది. దీని ‘ఫాసిల్ స్టీల్’ కలర్ మీ కిచెన్‌కు ఒక మోడ్రన్ , ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది డబుల్ డోర్ మోడల్ కాబట్టి, పైన ఫ్రీజర్ , కింద సాధారణ రిఫ్రిజిరేటర్ సెక్షన్ విడివిడిగా ఉంటాయి. దీని వల్ల కూలింగ్ లీక్ అవ్వకుండా ఆహారం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.

మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ :
ఈ ఫ్రిజ్ లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని ఇన్వర్టర్ కంప్రెసర్. ఇది ఫ్రిజ్ లోపల ఉన్న లోడ్‌కు అనుగుణంగా తన స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల కూలింగ్ చాలా స్థిరంగా ఉండటమే కాకుండా.. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల కంప్రెసర్ మీద లోడ్ తగ్గి, ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నికనిస్తుంది.

Advertisement

కీలక ఫీచర్లు:
ఫ్రాస్ట్ ఫ్రీ : ఇందులో ఐస్ గడ్డ కట్టే సమస్య ఉండదు. ఆటోమేటిక్ డీఫ్రాస్టింగ్ సిస్టమ్ వల్ల ఫ్రీజర్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది.

టఫ్డ్ గ్లాస్ షెల్వ్స్ : ఇందులో గట్టిగా ఉండే గ్లాస్ షెల్ఫ్‌లు ఇచ్చారు. మీరు బరువైన బిందెలు లేదా గిన్నెలు పెట్టినా ఇవి తట్టుకోగలవు.

బిల్ట్-ఇన్ స్టెబిలైజర్: ఈ ఫ్రిజ్ వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకోగలదు. కాబట్టి మీరు విడిగా స్టెబిలైజర్ కొనాల్సిన అవసరం లేదు.

పెద్ద వెజిటబుల్ ట్రే: కూరగాయలు , పండ్లను స్టోర్ చేసుకోవడానికి ఇందులో ఎక్కువ స్పేస్ ఇచ్చారు.

Also Read: రూ.15 వేలకే 9kg భారీ వాషింగ్ మెషీన్!ఉప్పు నీటితోనూ మొండి మరకలు మాయం

పెర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్:
గోద్రెజ్ ఫ్రిజ్‌లు మన వాతావరణానికి అనుగుణంగా తయారవుతాయి. ఇందులో కూలింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు కూడా లోపల చల్లదనం ఎక్కువ సేపు ఉండేలా దీని ఇన్సులేషన్ డిజైన్ చేశారు. దీని వెయిట్ సుమారు 47.5 కేజీలు ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ.

ధర :
మార్కెట్లో గోద్రెజ్ 244L డబుల్ డోర్ ఫ్రిజ్ ధర సుమారు రూ. 23,990 గా ఉంది. ఆన్‌లైన్ సేల్స్ (అమెజాన్/ఫ్లిప్‌కార్ట్) సమయంలో లేదా పండగ ఆఫర్లలో దీనిని రూ. 21,000 నుంచి రూ. 22,000 ధరకే పొందే అవకాశం ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు వాడితే ఇది ఒక సూపర్ డీల్ అవుతుంది.

మీరు రూ. 25 వేల లోపు మంచి బ్రాండెడ్, డబుల్ డోర్ ఫ్రిజ్ కోసం చూస్తుంటే.. Godrej 244 L RF EON 244C 35 RCIF కచ్చితంగా మీ లిస్టులో ఉండాలి. అద్భుతమైన కూలింగ్, కరెంట్ ఆదా, నమ్మకమైన గోద్రెజ్ సర్వీస్ నెట్‌వర్క్ దీనిని ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తున్నాయి.

Related News

ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

Big Stories

Advertisement
×