E-Paper
Advertisement

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!
Advertisement

Summer Cooling Tips: జూన్ నెల మొదలైనప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళ బయట నుంచి ఇంట్లోకి వస్తే గది నిప్పులా కొలిమిలా సెగలు కక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఈ వేడి తట్టుకోలేక చాలామంది రోజంతా ఏసీలు ఆన్ చేసి పెడుతుంటారు. దీనివల్ల నెల తిరిగేసరికి కరెంట్ బిల్లులు మోత మోగిపోతాయి. అయితే, వేల రూపాయల బిల్లులు పెట్టే ఏసీలు లేకుండానే.. కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని చల్లబరుచుకునే అద్భుతమైన దేశీ చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇల్లు ఎందుకు వేడెక్కుతుంది?

ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే ముందుగా ఇల్లు ఎందుకు అంతగా వేడెక్కుతుందో తెలుసుకోవడం ముఖ్యం. రోజంతా పడే నడినెత్తి ఎండ వల్ల ఇంటి కాంక్రీట్ పైకప్పు విపరీతంగా వేడెక్కిపోతుంది. ఆ వేడి నెమ్మదిగా కిందికి దిగి గదులన్నింటినీ ఉడకబెట్టేస్తుంది. అందుకే మేడ మీది భాగాన్ని చల్లబరిస్తే ఇల్లు ఆటోమేటిక్‌గా కూల్ అవుతుంది.

రిఫ్లెక్టివ్ పెయింట్:

Advertisement

సాధారణంగా నలుపు లేదా ముదురు రంగులు వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే ఇంటి సర్ఫేస్ మీద తెల్లటి సున్నం లేదా హీట్ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయడం చాలా మంచిది. ఇది సూర్యరశ్మిని తిరిగి వెనక్కి పంపేస్తుంది. దీనివల్ల పైకప్పు వేడెక్కదు. రూమ్ లోపల ఉష్ణోగ్రత కూడా చాలా వరకు తగ్గుతుంది.

గ్రీన్ షేడ్ నెట్:

నగరాల్లో ఇప్పుడు ఈ పద్ధతి బాగా పాపులర్ అవుతోంది. టెర్రస్ పైన గ్రీన్ కలర్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల ఎండ నేరుగా సిమెంట్ స్లాబ్‌పై పడకుండా ఉంటుంది. ఈ గ్రీన్ నెట్లు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి ఎండ తీవ్రతను అడ్డుకుని ఇల్లు చల్లగా ఉండేలా చూస్తాయి.

Advertisement

Also Read: ఏసీ సర్వీసింగ్ చేయిస్తున్నారా? టెక్నీషియన్లు చెప్పే ఈ అబద్ధాలతో జాగ్రత్త.. లేదంటే కొంప ముంచుతారు!

మిద్దె తోటలు, మొక్కలు:

ఇంటి పైన కాస్త ఖాళీ స్థలం ఉంటే చిన్నపాటి కుండీల్లో మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి. మొక్కలు ఉన్నచోట సహజంగానే చల్లదనం ఉంటుంది. ఇవి సూర్యరశ్మిని నేరుగా కాంక్రీట్‌కు తాకనివ్వవు. పైగా ఈ పచ్చదనం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారి వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మధ్యాహ్నం వేళ నీళ్లు చల్లడం:

ఇది మన పెద్దల కాలం నాటి పాత పద్ధతి అయినప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది. ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో మేడ పైన నీళ్లు చల్లాలి. నీరు ఆవిరైపోయే క్రమంలో కాంక్రీట్ లోని వేడినంతా లాగేస్తుంది. దీనివల్ల రాత్రిపూట గదుల్లో వేడి సెగలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

జనపనార సంచులు:

పల్లెటూళ్లలో ఇప్పటికీ వాడే మరో సూపర్ టెక్నిక్ ఇది. టెర్రస్ పైన జనపనార గోనె సంచులు లేదా వెదురు చాపలను పరవాలి. వీటిని కాస్త నీళ్లతో తడిపితే చల్లదనం ఇంకా పెరుగుతుంది. ఏసీలు కొనే బడ్జెట్ లేని వారికి, భారీ కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఈ చిట్కాలు అద్భుతంగా పనికొస్తాయి.

Also Read: ఈ మండే ఎండలకు తక్కువ బడ్జెట్లో ఏసీ కావాలా? రూ. 25,000 లోపు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×