E-Paper
Advertisement

ఐఫోన్ లవర్స్ ఎగిరి గంతేసే డిస్కౌంట్.. Apple Airపై ఏకంగా రూ.30,000 ధర తగ్గింపు!

ఐఫోన్ లవర్స్ ఎగిరి గంతేసే డిస్కౌంట్.. Apple Airపై ఏకంగా రూ.30,000 ధర తగ్గింపు!
Advertisement

iPhone Offers: జీవితంలో ఒక్కసారైనా యాపిల్ ఫోన్ వాడాలనేది చాలామంది యువత కోరిక. కానీ ఐఫోన్ల ధర ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో యాపిల్ లవర్స్ వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది iPhone 17 సిరీస్‌తో పాటు మార్కెట్లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన iPhone Air ధర ఇప్పుడు భారీగా తగ్గింది. మామూలుగా కొత్త ఐఫోన్ల మీద ఇంత త్వరగా రేటు తగ్గడం చాలా అరుదు. కానీ ఏకంగా రూ.29,000 పైనే తగ్గింపు ప్రకటించడంతో టెక్ ప్రియుల్లో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 256GB మోడల్ కోసం ఎదురుచూసే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

iPhone Air మార్కెట్లో లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,19,900గా ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో దీనిని రూ.94,990కే లిస్ట్ చేశారు. ఇక్కడితో ఆఫర్ అయిపోలేదు. మీరు గనుక సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. అన్నీ కలిపి చూసుకుంటే ఈ లేటెస్ట్ ఐఫోన్ రూ. 90,990కే వచ్చేస్తుంది. ఒకేసారి అంత డబ్బు కట్టలేము అనుకుంటే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఏడాది పాటు నెలకు కొంత చొప్పున కట్టుకుంటూ ఈ సిమ్మెస్ట్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మీ గూగుల్ అకౌంట్ వేరే డివైజుల్లో ఉండిపోయిందా? ఇలా సింపుల్‌గా రిమూవ్ చేయండి!

ఇది యాపిల్ ఇప్పటివరకు తయారు చేసిన ఫోన్లలో కెల్లా అత్యంత సన్నని ఫోన్. కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఒకప్పుడు iPhone 6 ఎంత సన్నగా ఉండేదో ఇది దానికంటే కూడా స్లిమ్‌గా ఉంటుంది. అయితే సన్నగా ఉంది కదా అని త్వరగా విరిగిపోతుందేమో అని భయపడక్కర్లేదు. దీని బాడీ కోసం చాలా గట్టిదైన గ్రేడ్ 5 టైటానియం వాడారు. అలాగే స్క్రీన్ పగిలిపోకుండా సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. స్టైల్‌తో పాటు పటిష్టతలోనూ ఈ ఫోన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.

Advertisement

ఈ ఫోన్ కేవలం చూడ్డానికి మాత్రమే కాదు.. వాడేటప్పుడు కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇందులో వాడిన ఏ19 ప్రో చిప్ సెట్ వల్ల ఎలాంటి గేమ్స్ ఆడినా, భారీ యాప్స్ వాడినా అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక 6.5 అంగుళాల డిస్‌ప్లే క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీడియోలు చూస్తున్నప్పుడు దృశ్యాలు కళ్లకు కట్టినట్టు ఉంటాయి. ఇక ఫొటోగ్రఫీ టవర్స్ కోసం 48MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 18MP కెమెరా ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం కూడా బాగానే ఉంది. లేటెస్ట్ వై-ఫై 7 సపోర్ట్ కూడా ఉండటంతో ఇంటర్నెట్ స్పీడ్ అదిరిపోతుంది.

Also Read: ఐఫోన్ ఫోల్డ్ వచ్చేస్తోంది.. హింజ్ విషయంలో యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×