E-Paper
Advertisement

ఇది కదా ప్లాన్ అంటే.. రూ.79కే జియో అదిరిపోయే గిఫ్ట్.. నెలంతా ఎంజాయ్ పండగో!

ఇది కదా ప్లాన్ అంటే.. రూ.79కే జియో అదిరిపోయే గిఫ్ట్.. నెలంతా ఎంజాయ్ పండగో!
Advertisement

Jio Plans: టెలికాం రంగంలో తన సంచలన ఆఫర్లతో ఎప్పుడూ దూసుకుపోయే రిలయన్స్ జియో (Jio).. మరోసారి వినియోగదారుల ముందుకు ఒక అదిరిపోయే ప్లాన్‌తో వచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఆశించే కస్టమర్ల కోసం.. జియో సరికొత్త రూ. 79 ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ బడ్జెట్ లో నెల రోజుల వ్యాలిడిటీతో పాటు ఉచితంగా ఓటీటీ కంటెంట్ ను వీక్షించవచ్చు. సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ ను వీక్షించవచ్చు. జియో తీసుకొచ్చిన రూ.79 ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

 30 రోజుల వ్యాలిడిటీ

ప్రస్తుతం ఏ నెట్‌వర్క్ లోనైనా బేసిక్ రీఛార్జ్ చేయాలంటే.. రూ.100కు పైగా ఖర్చు చేయాల్సిందే. కానీ జియో తీసుకొచ్చిన ఈ రూ. 79 ప్లాన్‌తో వినియోగదారులు.. నెల రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి.. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే మిడిల్ క్లాస్ వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఫ్రీగా జియో హాట్ స్టార్..

Advertisement

జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్ లో హైలెట్ జియో హాట్ స్టార్ అని చెప్పవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా హాట్ స్టార్ కంటెంట్ ను వినియోగదారులు వీక్షించవచ్చు. ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే లైవ్ స్పోర్ట్స్, సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ టీవీ షోలను తమ మొబైల్స్‌లో ఆస్వాదించవచ్చు. తక్కువ ధరలో మంచి వినోదాన్ని కోరుకునేవారికి.. ఈ ప్లాన్ బెస్ట్ గా నిలుస్తోంది.

మరి కాల్స్ సంగతేంటి?

అయితే ఈ ప్లాన్ కింద యూజర్లకు ఎలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ లు లభించవు. అయితే 30 రోజుల కాలానికి 3GB డేటా మాత్రం యూజర్ పొందొచ్చు. ఒకవేళ డేటా కాల్స్, ఎస్ఎంఎస్ లు కావాలని భావిస్తే.. సంబంధిత ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.. హాట్ స్టార్ ఉచితంగా అందించడమేనని స్పష్టం చేశాయి.

Advertisement

Also Read: ప్రతి విషయంలో వెంటనే రియాక్ట్ కావడం బలహీన వ్యక్తిత్వానికి సూచన.. చాణక్యుడు ఏం చెప్పాడంటే

కస్టమర్లను ఆకట్టుకునే వ్యూహం!

ఇటీవల కాలంలో జియో తన టారిఫ్ లను పెంచడం, మార్పులు చేయడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు వెళ్లకుండా చూసేందుకు జియో ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పైగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్, యువత పెద్ద ఎత్తున ఓటీటీలను వీక్షిస్తున్న నేపథ్యంలో రూ.79 ప్లాన్ ను జియో వర్గాలు తెరపైకి తీసుకొచ్చాయి. తద్వారా యూత్ ను ఆకర్షించాలని జియో భావిస్తోంది.

Also Read: ఆరోగ్యవంతమైన మిల మిల మెరిసే చర్మం.. రోజూ పసుపు నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×