E-Paper
Advertisement

Apple Company: ఆపిల్‌ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. టిమ్ కుక్ డ్రాప్, కొత్త బాధ్యతలేంటో తెలుసా?

Apple Company: ఆపిల్‌ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. టిమ్ కుక్  డ్రాప్, కొత్త బాధ్యతలేంటో తెలుసా?
Advertisement

Apple Company: ఆపిల్‌ టెక్ కంపెనీలో టి‌మ్ కుక్ శకం ఇంకా కంటిన్యూ అవుతోంది. దశాబ్దమున్నరపాటు సీఈవోగా సేవలు అందించిన ఆయన, తన పదవి నుంచి తప్పుకున్నారు. టిమ్‌కుక్ స్థానంలో కొత్త సీఈవో జాన్ టెర్నస్‌ను నియమించింది ఆ కంపెనీ.సీఈవో పదవి నుంచి తప్పుకున్న టిమ్ కుక్, ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఆపిల్‌ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్

Advertisement

యాపిల్ ఫోన్ పేరు చెప్పగానే ముందుగా టిమ్ కుక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆ ఫోన్‌తో ఆయన బంధం అంత బలమైంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వినియోగదారులను పెంచే ప్రయత్నం చేశారు. దాదాపు దశాబ్దమున్నరపాటు సీఈఓగా సేవలందిం చిన ఆయన, ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

టిమ్‌కుక్ స్థానంలోకి యాపిల్ కొత్త సీఈఓగా 50 ఏళ్ల జాన్ టెర్నస్ రానున్నారు. రెండున్నర దశాబ్దాలుగా ఆయనకు యాపిల్‌తో అనుబంధం ఉంది. పాతికేళ్ల కిందట ఆ కంపెనీలో చేరిన జాన్ టెర్నస్, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం హెడ్‌గా కొనసాగుతున్నారు. మ్యాక్స్, ఐప్యాడ్స్, ఎయిర్ ‌పాడ్స్ లాంటి ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

టిమ్ కుక్‌కు కొత్త బాధ్యతలు.. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంట్రీ

AI సెక్టార్‌లో ఎన్విడియా, మెటా వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ నెలకొంది. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ నాయకత్వ మార్పులు చేర్పులు చేసింది. ఐఫోన్లలో ఏఐని ఉపయోగించడం, ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి కొత్త తరం ఉత్పత్తులపై దృష్టి సారిస్తారన్నది విశ్లేషకుల మాట.

ఇటీవల ఈ కంపెనీ.. గూగుల్ జెమినీ ఏఐ మోడల్‌ను వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకుంది కూడా. ఇక టిమ్ కుక్ విషయానికి వద్దాం. స్టీవ్ జాబ్స్ అనారోగ్యంతో తప్పుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో కంపెనీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇకపై జానీ స్రౌజీని హార్డ్‌వేర్ హెడ్‌గా వ్యవహరించనున్నారు.

ALSO READ: వామ్మో.. ఫొటో చూపించి ఫోన్లను అన్‌లాక్ చేయొచ్చా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో భారీ భద్రతా లోపం!

ఐఫోన్ 17 ప్రో మోడళ్ల కొత్త డిజైన్, అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ ఎయిర్‌ సహా తాజా ఉత్పత్తులను తీర్చిదిద్దడంలో టెర్నస్ బృందం ఫోకస్ చేయనుంది. ఈ ఏడాది చివర్లో ఆపిల్ సంస్థ ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నారు. 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను విడుదల చేసినప్పటి నుండి అందులో అత్యంత తీవ్రమైన మార్పుగా భావిస్తున్నారు.

టిమ్ కుక్.. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆపిల్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనివల్ల కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాలపై టిమ్ తన ప్రభావాన్ని కొనసాగించడానికి వీలవుతుంది. ఆపిల్ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న కొద్దిరోజులకు నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.

 

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×