E-Paper
Advertisement

Motorola Edge 50 Ultra: ‘మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా’ ఫీచర్స్​ లీక్.. ఆ ఫోన్ కంటే స్పీడ్ ఎక్కువే..!

Motorola Edge 50 Ultra: ‘మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా’ ఫీచర్స్​ లీక్.. ఆ ఫోన్ కంటే స్పీడ్ ఎక్కువే..!
Advertisement

Motorola Edge 50 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మొబైల్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు మరో మోడల్‌ను మార్కెట్‌లో తీసుకురావడానికి సిద్ధమైంది.

ఈ సారి తన ఎడ్జ్ 50 సిరీస్‌లో ‘మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా’ మోడల్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 16న ఈ మొబైల్‌ లాంచ్ కానున్న నేపథ్యంలో తాజాగా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఓ వెబ్‌సైట్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అడ్రినో 735 జీపీయూతో కనెక్ట్​ చేసిన కొత్త క్వాల్కమ్​ స్నాప్‌​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 SOCతో పనిచేయనుందని తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా ఇది అదనంగా 12జీబీ ర్యామ్‌తో వచ్చే అవకాశముందని సమాచారం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మోటోరోలా యూఐపై పనిచేయనుందని టాక్ నడుస్తోంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 50MP సెన్సార్, 5X ఆప్టికల్ జూమ్‌తో కూడిన సెరిస్కోప్ లెన్స్ వంటివి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 144Hz పోలెడ్ స్క్రీన్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. 125W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్‌తో వచ్చే అవకాశముంది.

Also Read: నాలుగు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!

Advertisement

అంతేకాకుండా దీని కలర్ ఆప్షన్ కూడా లీక్ అయింది. ఇది పాంటోన్ కలర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. అలాగే బ్లాక్ – లేత గోధుమ కలర్ షేడ్స్ ఉంటుంది. ఇందులో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఎక్కువ పనితీరు ఉంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ధర, ఫీచర్ల వివరాలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇకపోతే ఇటీవల లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో రెండు వేరియంట్లలో వచ్చింది. అందులో 8/256 జీబీ వేరియంట్ ధర రూ .31,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 12 /256 జీబీ​ వేరియంట్ ధర రూ .35,999గా ఉంది. ఈ మొబైల్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ సహా.. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో వీటిని కొనుక్కోవచ్చు.

Tags

Related News

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Big Stories

Advertisement
×