E-Paper
Advertisement

Oppo A3 Pro Leaks: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. కొత్తగా వస్తోంది.. దీనిలో అన్నీ ఎక్కువే!

Oppo A3 Pro Leaks: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. కొత్తగా వస్తోంది.. దీనిలో అన్నీ ఎక్కువే!
Advertisement

Oppo A3 Pro Leaks: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో A3 Pro స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను భారతదేశంలో Oppo F27 Pro+గా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఒప్పో తాజాగా Oppo A3 Pro స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో కొన్ని మార్పులు చేయనుంది. డిజైన్, స్పెసిఫికేషన్లలో ఛేంజెస్ ఉండొచ్చని కొన్ని లీక్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలో Oppo A3 Pro ధర, డిజైన్ టిప్‌స్టర్ సుధాన్షు (@Sudhanshu1414) లీక్ చేశారు. ఇది నిజమైతే Oppo A3 ప్రో బేస్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999గా ఉండే అవకాశం ఉంది. అయితే 8GB + 256GB వేరియంట్ ధర 19,999 రూపాయలుగా ఉంటుంది.

Advertisement

Oppo A3 Pro స్మార్ట్‌ఫోన్ థిక్ బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే ముందు కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌ను కూడా కలిగి ఉంది. దీనితో పాటు లీక్ ద్వారా వెల్లడైన ఫోన్ బాక్స్ ఇమేజ్ ఇది 360 డిగ్రీల డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో వస్తుంది. ఈ ఫీచర్ Oppo A3 Pro చైనీస్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అదనంగా ఇది స్ప్లాష్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా డిస్‌ప్లే తడిగా ఉన్నప్పుడు కూడా  పని చేస్తుంది.

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతే Oppo A3 Pro ఫోన్ 6.6-అంగుళాల డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB RAM+ 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది.

Advertisement

ఇది పెద్ద 5,100mAh బ్యాటరీ ప్యాక్‌తో 45W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే Oppo A3 ప్రో 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Oppo A3 ప్రో 8GB + 128 GB మోడల్ ధర రూ. 17,999 నుండి ప్రారంభమవుతుంది. 8 GB + 256 GB మోడల్ ధర రూ. 19,999గా ఉంటుందని టిప్‌స్టర్ సుధాన్షు అంభోర్ పేర్కొన్నారు. అయితే ఈ కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. కంపెనీ త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

Tags

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×