E-Paper
Advertisement

Philips Headphones Soundbars: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!

Philips Headphones Soundbars: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!
Advertisement

Philips Headphones Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫిలిప్స్ ఆడియో ప్రియుల కోసం ఇండియన్ మార్కెట్లోకి ఒకేసారి ఐదు రకాల కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో సౌండ్‌బార్స్, బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌ఫోన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. మీరు మ్యూజిక్ లవర్ అయినా లేదా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ పాటలు వినాలనుకునే వారైనా.. అందరినీ ఆకట్టుకునేలా వీటిని డిజైన్ చేశారు. మరి ఆ ప్రొడక్ట్స్ మీద ఓ లుక్కేద్దామా..

ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు తగ్గట్టుగా ధరలను నిర్ణయించింది ఫిలిప్స్. TAA1009 స్పోర్ట్స్ హెడ్‌ఫోన్స్ కేవలం రూ.899 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ప్రీమియం క్వాలిటీ కోరుకునే వారి కోసం SHP9500 హెడ్‌ఫోన్స్‌ను రూ.12,999కి అందిస్తున్నారు. సౌండ్‌బార్ల విషయానికి వస్తే.. TAB4230 మోడల్ ధర రూ.19,999గా ఉంది. అలాగే పోర్టబుల్ స్పీకర్ TAS4400 ధర రూ.5,999 కాగా, మినీ సౌండ్‌బార్ TAB4120ని రూ.3,999కే సొంతం చేసుకోవచ్చు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, దగ్గర్లోని ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

Advertisement

Also Read: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తేడాలు తెలుసుకోకుండా కొంటే నష్టపోతారు!

హెడ్‌ఫోన్స్ ఫీచర్లు ఇవే:

ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కోసం తెచ్చిన TAA1009 ఇయర్ ఫోన్స్ వాడితే.. చెవిలో నుంచి అస్సలు జారిపోవు. దీనికి ఉన్న వింగ్ టిప్స్ అంత పట్టునిస్తాయి. పైగా వర్కవుట్ చేసేటప్పుడు చెమట పట్టినా పాడవకుండా IPX4 రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ఇక మ్యూజిక్‌ను ఇష్టపడే వారి కోసం SHP9500 మోడల్ ఉంది. ఇది ఓపెన్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. దీనిలో ఉన్న 50 MM డ్రైవర్లు సరికొత్త ఆడియో అనుభూతిని అందిస్తాయి. దీని కుషన్లు చాలా మెత్తగా ఉండంటతో ఎంతసేపు వాడుకున్నా చెవులు నొప్పి రాదు.

పవర్‌ఫుల్ సౌండ్‌బార్స్, స్పీకర్లు:

Advertisement

ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్ కావాలనుకుంటే.. 300 వాట్ల అవుట్‌పుట్ ఇచ్చే TAB4230 సౌండ్‌బార్ ఉత్తమం. ఇది డాల్బీ డిజిటల్ సౌండ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక TAS4400 బ్లూటూత్ స్పీకర్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది. దీనికి మ్యాగ్నెటిక్ అటాచ్‌మెంట్ సిస్టమ్ ఉంది. పైగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పాటలు వినొచ్చు. చిన్న గదుల కోసం రూపొందించిన మినీ సౌండ్‌బార్ TAB4120 లో RGB లైటింగ్ కూడా సెటప్ ఉంటుంది.

క్వాలిటీ పరంగా చూసుకుంటే:

తక్కువ ధరలో బేసిక్ ఇయర్ ఫోన్స్ కావాలనుకునే వారి దగ్గరి నుంచి, ప్రొఫెషనల్ క్వాలిటీ కోరుకునే వారి వరకు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఫిలిప్స్ ఈ ఉత్పత్తులను తెచ్చింది. మీరు టీవీ సౌండ్‌ను పెంచాలనుకున్నా లేదా ప్రయాణాల్లో హాయిగా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకున్నా ఈ కొత్త ప్రొడక్ట్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.

Also Read: ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ఫ్రిడ్జ్ పేలిపోతుంది!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×