E-Paper
Advertisement

PhonePe: ఫోన్‌పే యూజర్స్‌కు శుభవార్త.. లావాదేవీలకు పిన్ నంబర్ నో, ఎలా చేయాలంటే..

PhonePe: ఫోన్‌పే యూజర్స్‌కు శుభవార్త.. లావాదేవీలకు పిన్ నంబర్ నో, ఎలా చేయాలంటే..
Advertisement

PhonePe: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి వివిధ సంస్థలు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వినియోగదారులకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నాయి. ఈ విషయంలో ఫోన్‌పే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజగా రోజువారీ డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు వినియోగదారులు కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. లావాదేవీలు చేసే ప్రతిసారీ UPI పిన్‌ను నమోదు చేయకుండానే 5000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఫోన్‌పే యూజర్స్‌కు శుభవార్త.. లావాదేవీలకు పిన్ నెంబర్ అవసరం లేదు

Advertisement

రోజువారీ డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు కస్టమర్లకు తీసికబురు చెప్పింది ఫోన్‌పే. తక్కువ మొత్తంతో లావాదేవీలు చేసేవారు ప్రతి ట్రాన్సాక్షన్‌కు పిన్ నెంబర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. యూపీఐ చెల్లింపుల కోసం కొత్తగా బయో మెట్రిక్ అథెంటికేషన్‌ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది ఆ సంస్థ.

ఇకపై కస్టమర్లు తమతమ స్మార్ట్‌ఫోన్ నుంచి లావాదేవీలు చేసేటప్పుడు ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ ద్వారా చేయవచ్చని తెలిపింది. అయితే వినియోగదారులు ఎంతవరకు ఆ తరహా లావాదేవీలు చేయవచ్చు అనేది అసలు పాయింట్. కొత్త ఫీచర్ ద్వారా 5 వేల వరకు లావాదేవీలు చేయవచ్చు. పరిమితి దాటిన మొత్తం లావాదేవీలకు కస్టమర్లు కచ్చితంగా పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఈజీగా లావాదేవీలు చేయొచ్చు.. కొత్త ఫీచర్ అదే

లైటింగ్ సరిగా లేకపోవడం, సెన్సార్ సమస్యల కారణంగా వేలి ముద్ర, ఫేస్ ఐడీ పనిచేయకపోతే వినియోగదారులు తమ UPI పిన్ ద్వారా పాత పద్ధతిలో చెల్లింపులు చేయవచ్చు. డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా చేయడానికి, చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారుల ఇబ్బందులను తగ్గించడానికి కొత్త ఫీచర్ రూపొందించినట్టు సదరు కంపెనీ పేర్కొంది.

కొత్త ఫీచర్ ద్వారా ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు,షాపుల్లో ఎక్కువగా లావాదేవీలు చేయడానికి ఉపయోగపడుతుంది. రద్దీ ఉన్న ప్రదేశాల్లో వేగంగా లావాదేవీలు చేయవచ్చు. ఎవరైనా పిన్ నెంబర్ చూస్తారన్న దిగులు అవసరం లేదు. కొత్త ఫీచర్ యాక్టివేట్ చేయడానికి ఫోన్‌పే యాప్‌లోని ప్రొఫైల్‌లో మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది.

దాన్ని క్లిక్ చేసి బయోమెట్రిక్ పేను ఎంచుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్‌ను ఎనేబుల్ చేయాలి. యూపీఐ పిన్ లేకుంటే బయోమెట్రిక్ ద్వారా వన్-టైమ్ సెటప్‌ పూర్తి చేయవచ్చు. ప్రస్తుతానికి కొత్త ఫీచర్ ఆండ్రాయి యూజర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని తెలిపింది. త్వరలో ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×