E-Paper
Advertisement

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్
Advertisement

Samsung Galaxy M36 5G: టెక్నాలజీ లోకంలో ఒక ఫోన్ ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియాలంటే రివ్యూస్ చాలా కీలకం. ప్రస్తుతం రూ. 19,341 ఆఫర్ ధరకే లభిస్తున్న Samsung Galaxy M36 5G స్మార్ట్‌ఫోన్, మిడ్-రేంజ్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 120Hz సూపర్ అమోలెడ్ స్క్రీన్, 50MP అడ్వాన్స్‌డ్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో, ఇది ఎంతవరకు బెస్ట్ చాయిస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

రూ. 19,341 కే క్రేజీ ఫీచర్స్:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇస్తూ, రూ. 20 వేల బడ్జెట్‌లో ఒక నమ్మకమైన బ్రాండెడ్ 5G ఫోన్‌ను శామ్‌సంగ్ పరిచయం చేసింది. ఆన్‌లైన్ స్టోర్లలో ఆఫర్లతో కలుపుకొని రూ. 19,341 కే లభిస్తున్న ఈ శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G, యూజర్ల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ ఫోన్‌లోని హైలైట్ ఫీచర్స్.

డిస్‌ప్లే మ్యాజిక్ :

Advertisement

ఈ ఫోన్‌లో శామ్‌సంగ్ బెస్ట్-ఇన్-క్లాస్ 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేని అందించింది. దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్.. ఉండటం వల్ల గేమింగ్ ఆడినా, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా.. స్క్రీన్ మూవ్‌మెంట్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మీరు ఎండలో.. నిలబడి ఫోన్ చూసినా సరే, హై-బ్రైట్‌నెస్ మోడ్ వల్ల స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల డిస్‌ప్లే చాలా స్ట్రాంగ్‌గా.. ఉంటుంది.

కెమెరా పీక్స్ :

ఫొటోగ్రఫీ, రీల్స్ చేసేవారి కోసం ఈ ఫోన్ అదిరిపోయే ఛాయిస్. దీని బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

Advertisement

50 MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో): ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల ఫోన్ కదిలినా సరే ఫొటోలు, వీడియోలు బ్లర్ అవ్వవు. శామ్‌సంగ్ సిగ్నేచర్ నైట్‌గ్రఫీ ఫీచర్ వల్ల చీకట్లో కూడా అద్భుతమైన ఫొటోలు వస్తాయి.

8 MP అల్ట్రా-వైడ్ లెన్స్: ఎక్కువ మందిని ఒకే ఫ్రేమ్‌లో కవర్ చేస్తూ వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవచ్చు.

2 MP మాక్రో లెన్స్: చిన్న వస్తువుల క్లోజప్ షాట్స్ కోసం ఇది ఉపయోగ పడుతుంది.

ఇక సెల్ఫీల కోసం 13 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ బడ్జెట్‌లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Exynos 1380 ప్రొసెసర్:

ఇందులో వాడిన 5nm,ఎక్సీనోస్ 1380 ప్రొసెసర్ రోజువారీ పనులకు, గేమింగ్‌కు చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. బరువైన యాప్స్ వాడినా.. ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. వేపర్ కూలింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఫోన్ ఎక్కువ సేపు వాడినా వేడెక్కదు. ఇది 6GB/8GB రామ్ వేరియంట్లలో.. లభిస్తోంది.

Also Read: స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

మోన్‌స్టర్ బ్యాటరీ:

ఇందులో భారీ 5000mAh బ్యాటరీ ఇచ్చారు. హెవీ యూసేజ్‌లో కూడా ఒక పూర్తి రోజు కంటే.. ఎక్కువగానే బ్యాకప్ ఇస్తుంది. నార్మల్ యూజర్లకైతే ఒకటిన్నర రోజులు ఆరాంగా వస్తుంది. దీనికి 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ డిజైన్ చాలా స్లిమ్‌గా (7.7mm మందం) ఉండి, చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది.

రూ. 19,341 బడ్జెట్‌లో ఒక నమ్మకమైన బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. Samsung Galaxy M36 5G కళ్ళు మూసుకుని కొనేయొచ్చు. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 4K నైట్ కెమెరా, లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో.. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగానే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×