E-Paper
Advertisement

Realme P1 Pro 5G Price Cut: 5జీ ఫోన్‌పై బిగ్ డీల్.. డిస్కౌంట్ చూస్తే ఎగిరిగంతేస్తారు!

Realme P1 Pro 5G Price Cut: 5జీ ఫోన్‌పై బిగ్ డీల్.. డిస్కౌంట్ చూస్తే ఎగిరిగంతేస్తారు!
Advertisement

Realme P1 Pro 5G Price Cut: టెక్ మార్కెట్‌లో ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ఇటీవలే పొటాపోటీగా ప్రత్యేకమైన సేల్స్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లు అందించాయి. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోన్లను ఆఫర్ చేశాయి. అంతే కాకుండా ప్రతి రోజూ ఏదొక ఆఫర్‌ను తీసుకొస్తూ భారీగా లాభాలను గడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్‌ని తీసుకొచ్చింది. కొన్ని నెలల క్రితం విడుదలైన Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ ప్రకటించింది.

ఇప్పుడు ఎటువంటి ఆఫర్ లేకుండా ఫోన్‌ను రూ.18,500కి అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. వీటి ద్వారా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: iPhone Offers: ఆపిల్ బిగ్ గిఫ్ట్.. భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు.. ఎందుకో తెలుసా?

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చౌకగా లభిస్తుంది. రియల్‌మీ P1 Pro 5G 8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 21,999గా ఉంది.  ఇప్పుడు ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,499 కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఫోన్‌‌పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా కస్టమర్‌లు రూ. 1,000 తగ్గింపును కూడా పొందవచ్చు.

Advertisement

ఈ బ్యాంక్ ఆఫర్ అన్ని క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత దీని ధర రూ.17,499కి తగ్గుతుంది, ఇది లాంచ్ ధర కంటే పూర్తిగా రూ.4500 తక్కువ. ఫోన్ ప్యారట్ బ్లూ,  ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

Realme P1 Pro Specifications
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల సూపర్ స్లిమ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 950 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఫోన్ మందం 8.35 మిమీ, బరువు 184 గ్రాములు మాత్రమే. ఫోన్‌లో 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో పాటు Adreno 710 GPU ఉన్నాయి. ఇది Android 14 ఆధారంగా Realme UI 5.0 పై రన్ అవుతుంది. 45W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు USB టైప్-C పోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ఫోన్‌లో ఉంటుంది.

Also Read: Top Selling Smartphones: ఆల్ టైమ్ రికార్డ్.. అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే.. ఎందుకంటారు?

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ Sony LYT-600 మెయిన్ కెమెరా సెన్సార్ OIS, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 చూడొచ్చు. డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లు, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×