E-Paper
Advertisement

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్
Advertisement

Best water filter for home: ప్రస్తుత కాలంలో నీటి కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతీ ఇంట్లో మంచి వాటర్ ప్యూరిఫైయర్ ఉండటం చాలా ముఖ్యం. అయితే.. ఎక్కువ డబ్బులు వెచ్చించకుండానే రూ. 10,000 నుంచి రూ. 15,000 మధ్యలో బెస్ట్ క్వాలిటీ, లేటెస్ట్ టెక్నాలజీ ఇచ్చే RO ప్యూరిఫైయర్లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. కాపర్ బూస్టర్, ఆల్కలైన్ ఫిల్ట్రేషన్, యూవీ డిసిన్ఫెక్షన్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో లభించే టాప్ 5 ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ల వివరాలు:

మంచి నీటిలో లవణాలు లేదా బ్యాక్టీరియా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు సాధారణ ఫిల్టర్లు సరిపోవు. RO + UV + UF కలిగిన మల్టీ-స్టేజ్ ప్యూరిఫైయర్లు నీటిని 100% స్వచ్ఛంగా మారుస్తాయి. మీరు రూ. 10,000 నుంచి రూ. 15,000 బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు పొందేందుకు అందుబాటులో ఉన్న 5 లేటెస్ట్ ఆప్షన్లు..

1.Kent Ace 8L RO + UV + UF + TDS Control:

Advertisement

వాటర్ ప్యూరిఫైయర్లలో ‘కెంట్’ బ్రాండ్‌కు ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. ఇందులో ఉండే.. మినరల్ ROటెక్నాలజీ వల్ల నీటిలోని సహజ సిద్ధమైన మినరల్స్ కోల్పోకుండా నీరు స్వచ్ఛంగా మారుతుంది. 8 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్, TDS కంట్రోలర్, ఇన్-ట్యాంక్ UV LED. బోర్‌వెల్, కార్పొరేషన్ నీరు రెండింటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది.
ధర: రూ.12,499

2.Aquaguard Sure Delight NXT RO + UV + Taste Adjuster:

ఆక్వాగార్డ్ అందించే ఈ మోడల్ చాలా కాంపాక్ట్‌గా, క్లాసీ లుక్‌తో ఉంటుంది. నీటి మూలాన్ని బట్టి రుచిని అడ్జస్ట్ చేసే ఫీచర్ ఇందులో ఉంటుంది. 6 లీటర్ల కెపాసిటీ, యాక్టివ్ కాపర్-జింక్ బూస్టర్ టెక్నాలజీ, ఎనర్జీ సేవింగ్ మోడ్ దీని ప్రత్యేకతలు. అంతే కాకుండా కాపర్ ,జింక్ గుణాలు కలవడం వల్ల ఈ నీరు మరింత ఆరోగ్యకరంగా మారుతుంది.

Advertisement

ధర: రూ.10,499

3.HUL Pureit Eco Water Saver RO + UV + MF:

వాటర్ ప్యూరిఫైయర్ వాడేటప్పుడు చాలా నీరు వేస్ట్ అవుతుందనే సమస్య ఉంటుంది. కానీ ఈ మోడల్ నీటి వృధాను గణనీయంగా తగ్గిస్తుంది. 10 లీటర్ల పెద్ద స్టోరేజ్ ట్యాంక్, ఎకో వాటర్ సేవర్ టెక్నాలజీ, మినరల్ ఏంరిచ్‌మెంట్ దీని ప్రత్యేకతలు. సాధారణ ROలతో పోలిస్తే 60% వరకు నీటిని ఆదా చేయడంలో సహాయ పడుతుంది.
ధర: రూ. 13,999

4. Havells Mirak RO + UV + Alkaline:

నీటి pH లెవెల్స్‌ను సరిగ్గా ఉంచడం ఆరోగ్యానికి చాలా అవసరం. హావెల్స్ మిరాక్ మోడల్ నీటిని ఆల్కలైన్ వాటర్‌గా మార్చి డిటాక్సిఫికేషన్‌లో హెల్ప్ చేస్తుంది. 6 లీటర్ల స్టోరేజ్, 7-టు-8 స్టేజ్ ప్యూరిఫికేషన్, జీరో స్ప్లాష్ ఫ్యూసెట్ డిజైన్ దీని ప్రత్యేకతలు.
జీర్ణక్రియ ఈజీ కావడానికి , బాడీని ఆల్కలైన్‌గా ఉంచడానికి ఇది బెస్ట్.
ధర: రూ.14,499

Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

5.AO Smith Intelli UV Pro/X4 RO:

మోడర్న్ డిజైన్, స్మార్ట్ అలర్ట్స్ ఇష్టపడే వారికి AO స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్లు పర్ఫెక్ట్ ఛాయిస్. డ్యూయల్ పాస్ UV ప్రొటెక్షన్, డిజిటల్ డిస్‌ప్లే, ఫిల్టర్ చేంజ్ నోటిఫికేషన్లు దీని స్పెషాలిటీ. అంతే కాకుండా ఫిల్టర్ ఎప్పుడు మార్చాలో ముందే అలర్ట్ ఇవ్వడం వల్ల ఎల్లప్పుడూ క్లీన్ వాటర్ లభిస్తుంది.

ధర: రూ. 13,490

ఆరోగ్యకరమైన జీవితానికి స్వచ్ఛమైన తాగు నీరు పునాది. మీరు బోర్‌వెల్ నీరు వాడినా లేదా మున్సిపల్ వాటర్ వాడినా, రూ. 10,000 – రూ. 15,000 బడ్జెట్‌లోని ఈ 5 వాటర్ ప్యూరిఫైయర్లు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు పూర్తి భద్రతను అందిస్తాయి. మీ ఇంటి TDS లెవెల్స్‌కు అనుగుణంగా సరైన మోడల్‌ను ఎంచుకుని మీ కుటుంబ ఆరోగ్యానికి రక్షణ కల్పించండి.

Related News

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

Big Stories

Advertisement
×