French Door Fridges 2026: సమ్మర్ ఫ్రిడ్జ్ లకు ఏ స్థాయి డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. బేసిక్ నుంచి ప్రీమియం వరకూ ఉన్న టాప్ మోడల్స్ ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతుంటారు. అయితే వివిధ బ్రాండుల్లో వచ్చిన బాహుబలి లాంటి టాప్ క్లాస్ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ల గురించి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఇవి భారీ స్టోరేజ్ కేపాసిటీ, ఫోర్ డోర్స్ ను కలిగి ఉండటంతో పాటు అధునాతన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లోని 5 అత్యుత్తమ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు, వాటి ధరలు, ఫీచర్లను ఇప్పుడు పరిశీలిద్దాం.
శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ అడ్వాన్స్డ్ రిఫ్రిజిరేటర్.. అధునాతన ఫీచర్లతో పాటు స్టైలిష్ లుక్ ను కలిగి ఉంది. ఇందులో ఉండే AI Vision Inside కెమెరా సహాయంతో లోపల ఏమున్నాయో మీ ఫోన్ ద్వారానే చూడవచ్చు. 32 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో ఫిల్ వాటర్ పిచ్చర్, ఫ్లెక్స్ జోన్ (ఫ్రీజర్‌ను అవసరమైనప్పుడు ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు) ఇందులోని ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. మరోవైపు పదార్థాలు పాడవకుండా దీనిలో AI సిస్టమ్.. ఫుడ్ ఎక్స్ పైరీ తేదీలను ట్రాక్ చేసి యూజర్ కు చేరవేస్తుంది. కాగా ఇది రూ.79,990 పలుకుతోంది.
ఈ ఫ్రిడ్జ్.. నిశ్శబ్దంగా పనిచేస్తూ, ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. దీనిలోని VitaFreshPro సాంకేతికత ఉష్ణోగ్రత, తేమను నియంత్రిస్తుంది. కౌంటర్-డెప్త్ డిజైన్, ఇథిలీన్ గ్యాస్ ఫిల్టర్ (పండ్లు త్వరగా కుళ్ళిపోకుండా చేస్తుంది), Home Connect యాప్ సపోర్ట్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇందులోని డ్యూయల్ కంప్రెషర్లు.. ఫ్రిజ్, ఫ్రీజర్ నుంచి వచ్చే వాసనలు మిక్సప్ కాకుండా చూస్తాయి. ప్రస్తుతం ఇది విదేశాల్లో 3,899 డాలర్లకు అందుబాటులో ఉంది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.3,03,013కు సమానం.
ఎల్జీ తీసుకొచ్చిన ఈ ఫ్రిడ్జ్ సూపర్ స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫ్రిజ్ తలుపు తీయకుండానే లోపల ఏమున్నాయో చూడటానికి దీనిపై రెండుసార్లు తడితే చాలు. గ్లాస్ ప్యానెల్ వెలుగుతుంది. దీనివల్ల చల్లని గాలి అనవసరంగా బయటకు పోదు. ఫీచర్ల విషయానికి వస్తే.. క్రాఫ్ట్ ఐస్ మేకర్, ThinQ AI వాయిస్ కంట్రోల్, స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెషర్ ఇందులో ఉన్నాయి. కాగా మార్కెట్ లో దీని ధర రూ.79,990గా ఉంది.
విశాలమైన స్టోరేజ్ కోరుకునే వారికి ఈ ఫ్రిడ్జ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది. దీనిలోని Hands-Free Autofill సెన్సార్ మీరు గ్లాస్ ఉంచగానే ఆటోమేటిక్‌గా నీటిని నింపుతుంది. బ్యాక్‌లిట్ సాఫ్ట్ LED లైటింగ్, అడ్జస్టబుల్ షెల్ఫ్స్, వైఫై కనెక్టివిటీ దీనిలో ముఖ్యమైన ఫీచర్లుగా చెప్పవచ్చు. అలాగే దీనిలో ఉండే ప్రత్యేకమైన ఫీజర్ పార్ట్ ఉష్ణోగ్రతను సాఫ్ట్ డ్రింక్స్ లేదా మాంసం నిల్వకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే ఇది రూ.2,86,812కి అందుబాటులో ఉంది.
Also Read: Allahabad High Court: పెళ్లైన మగవారు.. పరాయి స్త్రీతో సహజీవనం చేయవచ్చు.. హైకోర్టు సంచలనం
ఈ రిఫ్రిజిరేటర్ మీ కిచెన్ కు ప్రీమియం లుక్ ను తీసుకొస్తుంది. నాలుగు తలుపుల డిజైన్‌తో కూడిన ఈ మోడల్ అద్భుతమైన స్టోరేజ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. కస్టమైజబుల్ హ్యాండిల్ ఫినిషింగ్స్, మల్టీ-చిల్ డ్రాయర్, తేమ నియంత్రించే క్రిస్పర్ బాక్స్‌లు ఇందులో ఉన్నాయి. ఆహార నాణ్యతను కాపాడటానికి ఇందులో అధునాతన కూలింగ్ వ్యవస్థను అమర్చారు. దీని ధర రూ.4,41,874 కావడం గమనార్హం.
ముఖ్యగమనిక: పైన పేర్కొన్న రిఫ్రిజిరేటర్ల సమాచారాన్ని.. ఆయా కంపెనీలు విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా అందించడం జరిగింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రొడక్ట్ ను కొనుగోలు చేసేముందు ఫీచర్లు, ధరను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది.
Also Read: Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!