E-Paper
Advertisement

Top Smartwatch Brands: బడ్జెట్ ఫ్రెండ్లీ టు ప్రీమియం లుక్: జెన్-జీ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు ఏవో తెలుసా?

Top Smartwatch Brands: బడ్జెట్ ఫ్రెండ్లీ టు ప్రీమియం లుక్: జెన్-జీ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు ఏవో తెలుసా?

Top Smartwatch Brands: ఇప్పుడు స్మార్ట్‌వాచ్ అంటే కేవలం గ్యాడ్జెట్ కాదు. అదొక పర్సనల్ స్టేట్‌మెంట్. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి స్మార్ట్‌వాచ్ మార్కెట్ ఇండియాను షేక్ చేసింది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు అందించే దేశీయ బ్రాండ్ల నుంచి, లగ్జరీ లుక్ ఇచ్చే ప్రీమియం వాచ్‌ల వరకు మార్కెట్ అంతా యువత అభిరుచులకు తగ్గట్టుగా మారిపోయింది. మరి ప్రస్తుతం ఇండియాలో ఏ బ్రాండ్లు టాప్ లో ఉన్నాయి ? యూత్ ఫేవరెట్ వాచ్‌లు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.

1. Fire-Boltt:
ఈ ఏడాది కూడా ఫైర్-బోల్ట్ తన నంబర్ వన్ స్థానాన్ని వదులుకోలేదు. అతి తక్కువ ధరలో రూ. 2,000 లోపు ప్రీమియం లుక్ ఇచ్చే వాచ్‌లను అందించడంలో ముందుంది. ముఖ్యంగా ఫైర్-బోల్ట్ నంజ కాల్ ప్రో ఫ్లస్ వంటి మోడళ్లు కాలేజీ స్టూడెంట్స్ , ఆఫీస్ కు వెళ్లే వారి మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ప్రతి వారం ఒక కొత్త డిజైన్, అదిరిపోయే అమోలెడ్ డిస్‌ప్లే, , మెటాలిక్ ఫినిషింగ్‌తో ఫైర్-బోల్ట్ మార్కెట్‌ను శాసిస్తోంది. బడ్జెట్‌లో “లగ్జరీ వైబ్” కావాలనుకునే వారికి ఇది గో-టు బ్రాండ్.

2. Noise & boAt:
యువత నాడి తెలిసిన బ్రాండ్లు ఇవి. నాయిస్ బ్రాండ్ తన సిరీస్‌తో యూత్‌ను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా నాయిస్ ఫిట్- 2 లోని ఏఐ కోచింగ్ ఫీచర్లు ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, బోట్ తన సిగ్నేచర్ స్టైల్‌తో దూసుకుపోతోంది. బోట్ స్ట్రోమ్ కాల్ 3 ప్లస్ మోడల్ దాని  ఆకర్షణీయమైన స్ట్రాప్ కలర్స్‌తో ఫిబ్రవరిలో బెస్ట్ సెల్లర్లలో.. ఒకటిగా నిలిచింది. ఈ రెండు బ్రాండ్లు బడ్జెట్ ధరలో క్వాలిటీ , స్టైల్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నాయి.

3.ప్రీమియం పవర్‌హౌస్:
డబ్బు ఎంతైనా పర్లేదు, ఫీచర్లు అల్టిమేట్‌గా ఉండాలి అనుకునేవారికి యాపిల్ సామ్సంగ్ గెలాక్సీ ఎప్పుడూ ఫేవరెట్లే. ఈ ఏడాది ఆపిల్ తన అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ప్రీమియం మార్కెట్‌లో 80శాతం వాటాను కలిగి ఉంది. సామ్సంగ్ తన గెలాక్సీ వాచ్‌లతో ఆండ్రాయిడ్ వినియోగదారులకు పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్‌ను అందిస్తోంది. వీటిలో ఉండే ఎలక్ట్రోకార్డియోమ్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ అప్నియా డిటెక్షన్ వంటి ఫీచర్లు కేవలం గ్యాడ్జెట్‌లుగానే కాకుండా హెల్త్ గార్డియన్స్‌గా పని చేస్తున్నాయి.

4. ట్రెండ్ కి తగ్గట్టుగా..
వింటేజ్ వాచ్ మార్కెట్ నుంచి వచ్చిన ఫాస్ట్రాక్ వాచ్ లు ఇప్పుడు స్మార్ట్ సెగ్మెంట్‌లో కూడా యువత మనసు దోచుకుంటోంది. “కూల్ అండ్ ఫంకీ” డిజైన్లతో ఫాస్ట్రాక్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే గోబోల్ట్ వంటి కొత్త బ్రాండ్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇస్తూ టాప్ బ్రాండ్లకు గట్టి పోటీనిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ, పట్టణ యువతకు ఈ మోడల్స్ దగ్గరవుతున్నాయి.

5. 2026 స్మార్ట్‌వాచ్ ట్రెండ్స్.. వాట్ ఈజ్ న్యూ?
ఫిబ్రవరి 2026 నాటి ట్రెండ్స్ గమనిస్తే.. కస్టమర్లు కేవలం ‘స్టెప్స్’ కౌంట్ చూసి సంతృప్తి చెందడం లేదు.

1.మెరుగైన క్లారిటీ ఇచ్చే డిస్‌ప్లేలు.

2. నాయిస్ క్యాన్సిలేషన్‌తో  క్లియర్ బ్లూటూత్ కాలింగ్.

3. రీసైకిల్డ్ మెటీరియల్‌తో చేసిన స్ట్రాప్‌లు , వాచ్ బాడీలకు డిమాండ్ పెరిగింది.

4.వాచ్ ఫేస్‌లు , మార్చుకోగలిగే స్ట్రాప్‌లు యూత్‌ను ఆకర్షిస్తున్నాయి.

Related News

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

Big Stories

×