Upcoming ACs April 2026: సమ్మర్ లో ఏసీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని టాప్ కంపెనీలు.. 2026 కొత్త ఏసీ మోడల్స్ ను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్ నాటికి మార్కెట్ లో అందుబాటులో ఉండే టాప్ ఏసీలు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నవారికి.. ఇవి బెస్ట్ ఆప్షన్స్ గా నిలవనున్నాయి. ఇంతకీ ఆ ఏసీలు ఏవి? వాటి ఫీచర్లు, లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ ఏసీ.. ప్రధానంగా AI (Artificial Intelligence) సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో ఉండే ‘విండ్‌ఫ్రీ’ టెక్నాలజీ ద్వారా గాలి నేరుగా ఒంటికి తగలకుండా 23,000 మైక్రో హోల్స్ ద్వారా గదిని చల్లబరుస్తుంది. ఇది వినియోగదారుల అలవాట్లను గుర్తించి ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఇందులోని AI ఎనర్జీ మోడ్ ద్వారా సాధారణ ఇన్వర్టర్ ఏసీల కంటే 30% మేర కరెంటును ఆదా చేయవచ్చు. మరోవైపు ఈ ఏసీని.. స్మార్ట్‌థింగ్స్ యాప్ ద్వారా ఫోన్ నుండే కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ (అలెక్సా, గూగుల్) కు సపోర్ట్ చేస్తుంది.
ఎల్‌జీ తన 2026 లైనప్‌లో 6-in-1 కన్వర్టిబుల్ ఆప్షన్లను మరింత అప్ గ్రేడ్ చేసింది. ముఖ్యంగా దీనిలోని ‘VIRAAT’ మోడ్ ద్వారా ఏసీ సామర్థ్యాన్ని 110% వరకు పెంచి ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా నిమిషాల్లో గదిని చల్లబరుచుకోవచ్చు. ఇందులో ఉండే క్యాటినిక్ సిల్వర్ అయాన్ ఫిల్టర్లు 99.9% వైరస్‌లు, బ్యాక్టీరియాను తొలగించేస్తాయి. మీరు ఇంటికి రాకముందే మీ లొకేషన్ (GPS) ఆధారంగా ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే ఫీచర్ సైతం ఈ ఎల్జీ ఏసీలో ఉంది.
డైకిన్ ఏసీలుకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. డైకిన్ తన లేటెస్ట్ 2026 మోడళ్లలో పెటెంట్ కలిగిన స్ట్రీమర్ డిశ్చార్జ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది గదిలోని దుమ్ము, ధూళితో పాటు గాలిలోని హానికరమైన కణాలను తొలగించి.. స్వచ్ఛమైన చల్లటి గాలిని అందిస్తుంది. 54°C తీవ్రమైన ఎండల్లోనూ సమర్థవంతంగా కూలింగ్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరోవైపు ఇందులోని 3D Airflow ఫీచర్.. గదిలోని ప్రతి మూలకు చల్లదనం సమానంగా అందేలా చేస్తుంది.
పానాసోనిక్ ఏసీలు MirAie టెక్నాలజీతో పనిచేస్తాయి. 2026 లేటెస్ట్ మోడల్ లో గాలి నాణ్యతను పెంచడానికి nanoe-G ప్యూరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది PM 2.5 ఫిల్టర్ల కంటే మెరుగ్గా పనిచేసి గాలిని స్వచ్ఛంగా మార్చేస్తుంది. మీ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని యాప్ ద్వారా ట్రాక్ చేసే వెసులుబాటును ఈ ఏసీ కల్పించింది. వర్షాకాలంలో గదిలోని తేమను తొలగించి సౌకర్యవంతంగా మార్చే డ్రై మోడ్ ఫీచర్ దీనికి అందించారు.
దేశీయ బ్రాండ్ అయిన వోల్టాస్.. 2026లో ‘ఐస్ వాష్’ (Ice Wash) టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది ఇండోర్ యూనిట్‌లోని కాయిల్స్‌పై పేరుకుపోయిన దుమ్మును గడ్డకట్టించి.. కరిగించడం ద్వారా ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తుంది. దీనికి ఉన్న సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ వల్ల ఏసీ సర్వీసింగ్ ఖర్చులు చాలా వరకూ తగ్గిపోతాయి. ఇంట్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా ఎటువంటి అదనపు స్టెబిలైజర్ లేకుండానే ఇది వర్క్ చేస్తుంది.
Also Read: LPG Ships: సముద్ర అలలపై ఇంధన కెరటాలు.. భారత్‌కు చేరుతున్న రెండు భారీ ఎల్పీజీ నౌకలు